ఖార్టూమ్ / సూడాన్: తూర్పు సూడాన్లో లో ఓ బంగారు గని పాక్షికంగా కూలడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా మైనర్లే కావడం గమనార్హం. తూర్పు నైలు నది ప్రావిన్స్లోని హౌయిడ్ పట్టణంలో కెర్ష్ అల్-ఫీల్ గని కూలిపోయినట్లు సుడానీస్ మినరల్ రిసోర్సెస్ లిమిటెడ్ కంపెనీ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటనలో మరో ఎనిమిది మందికి గాయాలు కాగా.. వారిని ఆస్పత్రిలో చేర్చించినట్లు పేర్కొంది. దీంతో ఈ గనిలో తవ్వకాలను నిలిపివేసినట్లు కంపెనీ తెలిపింది. బంగారం ఉత్పత్తిలో సూడాన్ ప్రధానమైన దేశంగా ఉన్నప్పటికీ.. భద్రతా ప్రమాణాలు సరిగా లేకపోవడంతో ఇక్కడి గనులు కూలడం సర్వసాధారణంగా మారిపోయింది.







































































































You must be logged in to post a comment.