* యూనియన్లకు అతీతంగా ఉమ్మడి ప్రెస్ క్లబ్ నిర్మాణం
* అందరికీ అందుబాటులోకి సభ్యత్వనమోదు కార్యక్రమం
* బాధ్యతలు స్వీకరించిన 12 మంది బృందం
* దిశానిర్దేశం చేసిన రాష్ట్ర నాయకులు ఆస్కాని మారుతి సాగర్
కుత్బుల్లాపూర్, నవతరం: నియోజకవర్గ ప్రెస్ క్లబ్ నిర్మాణ నిర్వహణ కమిటీని యూనియన్లకు అతీతంగా బుధవారం సూరారం ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సలహాదారులుగా ఆస్కాని మారుతిసాగర్, గడ్డమీద బాలరాజు, తన్నీరు శ్రీనివాస్, సభ్యులుగా గుంటూరు శేఖర్, రంగు వెంకటేష్, జగదీష్, కసుకుర్తి వెంకట్, కోలేపాక వెంకట్, జి. అశోక్, గోలిపల్లి దయాకర్ రెడ్డి, సుగ్రీవుడు ముదిరాజ్, రెడ్డిబోయిన మల్లేష్ యాదవ్, మాధవరెడ్డి, శివలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ… ప్రెస్ క్లబ్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని యూనియన్లకు సంబంధించిన 100 కి పైగా పాత్రికేయులు పాల్గొన్నారు.
త్వరలో ప్రెస్ క్లబ్ నిర్మాణం పూర్తిచేద్దాం



































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































