* దేశం గొప్ప మహనీయున్ని కోల్పోయింది
* కోల రవీందర్ ముదిరాజ్
కుత్బుల్లాపూర్: భరతమాత ముద్దుబిడ్డ, గొప్ప పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణించడం భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికే తీరని లోటని సామాజిక కార్యకర్త, పర్యావరణ ప్రేమికుడు కోల రవీందర్ ముదిరాజ్ పేర్కొన్నారు.గురువారం రతన్ టాటా చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోలా రవీందర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. గొప్ప మనసున్న మహానీయుడు,దయామయుడు, దేశభక్తిపరుడు, స్నేహశీలి, కార్మిక బంధు, పారిశ్రామిక విప్లవకారుడు, భారతదేశానికి దిక్సూచి రతన్ టాటా అని కొనియాడారు. తన పరిశ్రమల ద్వారా గుండు సూది మొదలుకొని విమానయాణం వరకు తయారు చేసి మన దేశంతోపాటు ప్రపంచ దేశాలకు ఎన్నో సేవాలాందించిన మహానీయుడు రతన్ టాటా అన్నారు. కరోనా సమయంలో ఏ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు చేయునటువంటి ఆర్థిక సహాయాన్ని భారత దేశానికి అందించిన గొప్ప మనసున్న మహనీయుడు రతన్ టాటా అన్నారు. భారతదేశానికి దేవుడిచ్చిన వరం మన రతన్ టాటా అని పేర్కొన్నారు.సామాన్యుడు కూడా కారులో తిరుగాలనే గొప్ప సంకల్పంతో తన టాటా పరిశ్రమల ద్వారా లక్ష రూపాయలకే కారును అందించిన మనసున్న మహనీయుడు మన రతన్ టాటా అని కొనియాడారు. అటువంటి పుణ్యపురుషుని పేరును పారిశ్రామిక వార్డులకు ఏర్పాటు చేయాలన్నారు.జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మరియు పార్లమెంటులో రతన్ టాటా విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. అందుకుగాను తమ సభ్యులందరు ఏకగ్రీవంగా తీర్మానించి ప్రభుత్వనికి అందజేస్తమ్మన్నారు. ఆయన ఆశయాలు నెరవేరాలన్నా, ఆత్మ శాంతించాలన్నా ప్రతిఒక్కరు టాటా పరిశ్రమలు తయారుచేసిన ఉత్పత్తులను కొనాలని పిలుపునిచ్చారు. అందుకుగాను తామంతా ప్రమాణం చేయడం జరిగిందన్నారు. టాటా వస్తువులు కొనడం వల్ల మన భారతదేశానికి సంపద చేకూరుతుందన్నారు.కాబట్టి విదేశీ వస్తువులు వద్దు స్వదేశీ వస్తువులు ముద్దు అని తమంతా టాటా వస్తువులే కొంటామని తీర్మానించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బట్టణాకర్,నందగోపాల్, చెంది శీను,కృష్ణ, సురేందర్,హరికృష్ణ,పవన్ రెడ్డి,బాబు, వెంకటేష్,అనిల్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.