నవతరం

తెలుగు దినపత్రిక

చిన్న పత్రికల సమస్యలు పరిష్కరిస్తాం


– యాడ్స్ విడుదల చేస్తాం

– అక్రెడిటేషన్స్ విషయం లో పారదర్శకంగా ఉంటాం

– సమాచార,పౌర సంబంధాలు శాఖ డైరెక్టర్ హామీ
– ఎంప్యానల్డ్ పత్రికల పెండింగ్ ప్రక్రియ పూర్తికి, కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఆదేశాలు జారీ

అమరావతి, అక్టోబర్ 24: రాష్ట్రంలో స్మాల్ పత్రికలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాంసు శుక్లా హామీ ఇచ్చారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఏపీ ఎంప్యానల్డ్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ (రి.నెం.312/2024) ప్రతినిధి బృందం ఆయనతో గురువారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఎంప్యానల్డ్ దిన పత్రికలకు రెగ్యులర్ గా యాడ్స్ రేటు కార్డు ప్రకారం విడుదల చేయాలని, రేటు కార్డు పెంచాలని కోరారు. పెండింగ్ లో ఉన్న స్మాల్ దినపత్రికలకు ఎంప్యానల్ మెంట్ పూర్తి చేయాలని, కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఆయనను కోరారు. వార, పక్ష, మాస పత్రికలకు యాడ్స్ విడుదల చేయాలని కోరారు. స్థానిక దినపత్రికలు పిరియాడికల్స్ కు అక్రిడేషన్లు పెంచాలని జీ ఎస్ టీ, ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ నిబంధనను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డైరెక్టర్ ఎంప్యానల్డ్ దిన పత్రికలకు సమాచార శాఖ యధావిధిగా యాడ్స్ విడుదల చేస్తుందని హామీ ఇచ్చారు. అక్రిడేషన్లు పెంచుతామని తెలిపారు. పెండింగ్ లో ఉన్న ఎంప్యానల్డ్ పైళ్లను క్లియర్ చేయాలని, కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో జాయింట్ డైరెక్టర్ పి. కిరణ్ కుమార్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ ఓ. మధుసూదన పాల్గొన్నారు. డైరెక్టర్ తో చర్చించిన వారిలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి. సత్య నారాయణ, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్ కుమార్, ఎన్.కోటేశ్వరావు, కార్యదర్శి మల్లెల శ్రీనివాసరావు, కార్యనిర్వహక కార్యదర్శి తొండెపు మారుతీ రావు, చెవుల రంగారావు తో పాటు పలు పత్రికల ఎడిటర్లు ఉన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading