నవతరం

తెలుగు దినపత్రిక

రాజకీయాలకు అతీతంగా పెన్షన్ల పంపిణీ

జగనన్న ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా అర్హులకు పెన్షన్ల పంపిణీ… ఆర్.కె.రోజా…


పుత్తూరు, నమస్తే ఎల్లంపల్లి: జగనన్న ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా అర్హులైనవారికి పెన్షన్లు పంపిణి చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. పుత్తూరు ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో పుత్తూరు రూరల్ మరియు మునిసిపాలిటీ లకు చెందిన వైస్సార్ పెన్షన్ కానుక పంపిణి కార్యక్రమం సందర్బంగా గురువారం జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు.నూతన సంవత్సరం రోజున అందరూ సంతోషంగా సంబరాలు చేసుకోవాలని ఈ పెన్షన్ల సంబరాలు ఒకటో తేదీ నుచి పెట్టారని చెప్పారు. మహాత్మాగాంధి కోరుకున్నట్లు గ్రామ స్వారాజ్యాన్ని ప్రజల వద్దకే పరిపాలన రావాలని ప్రజలకష్టాలను వారి ఇంటి వద్దనే పరిష్కరించాలని గొప్ప ఆలోచన తో సచివాలయ వ్యవస్థ ను తీసుకు రావడమే కాకుండా ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్స్ ను పెట్టారని తెలిపారు.

మీ ఇంటి వద్దకే వచ్చి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా ఎవరికి ఏ సంక్షేమ పథకాలు వస్తాయో వెరిఫై చేసి అప్లోడ్ చేసి అవి నేరుగా పెన్షన్లు అయితే ఒకటో తేదీ ఇంటికి వచ్చి వాలంటీర్స్ ఇచ్చి వెళ్తున్నారు మిగతా సంక్షేమ పథకాలను డైరెక్టుగా మీ అకౌంట్ లోకి రావడం జరుగుతుంది. ప్రజలకష్టాలను వారి ఇంటి వద్దనే పరిష్కరించాలని గొప్ప ఆలోచన తో సచివాలయ వ్యవస్థను తీసుకురావడమే కాకుండా ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్స్ ను పెట్టారని తెలిపారు. ప్రతి సమస్యను అప్లోడ్ చేయడమే కాకుండా టెక్నికల్ కారణంగా రాకపోతే పరిష్కరించి పెన్షన్ మంజూరు చేస్తున్నారని చెప్పారు. దీనికోసం మీరు ఎవర్నీ అడగాల్సిన అవసరం లేదు, ఎవరి ఇంటి చుట్టూ తిరాగాల్సిన పని లేదు.

ప్రజల వద్దకు పంపించి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో వెతికితే జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని కూడాచెప్పవచ్చని తెలిపారు. పుత్తూరు మున్సిపాలిటీ లో మొత్తం పెన్షన్స్ 5854 ల కు 1.65 కోట్లు రూపాయలు, కొత్తగా మంజూరైన పెన్షన్ లు 135కు మొత్తం 3,71,250 రూపాయలు,
పుత్తూరు రూరల్ లో పాత పెన్షన్స్ 3752 లకు 1,02,10,000 రూపాయలు కాగా కొత్తగా మంజూరైన పెన్షన్స్ 101 లకు 2,90,000 రూపాయలతో మొత్తం పెన్షన్స్ 3853 లకు
1,05,00,000 రూపాయలు వినియోగిస్తున్నారని వివరించారు. ఈ సమావేశం లో డీ ఆర్ డీ ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ జ్యోతి, మేఫ్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రాధమ్మ, పుత్తూరు మునిసిపల్ చైర్మన్, ఎంపీపీ వైస్ చైర్మన్ లు, వైస్ ఎంపీపీ లు కౌన్సిల్లర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, మున్సిపల్ కమీషనర్, ఎంపిడిఓ, తహసీల్దార్, రాష్ట్ర డైరెక్టర్లు , కమిటీ చైర్మన్లు, సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు మండల అధికారులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading