నవతరం

తెలుగు దినపత్రిక

గడపగడపకు మన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్, నమస్తే ఎల్లంపల్లి: విజయపురం మండలం కాళికాపురం సచివాలయం పరిధిలోని జిఎంపురం గ్రామాలలో బుధవారం “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా.

జి.యం పురం గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వారికి ప్రభుత్వం మంజూరు చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకోవటం‌ జరిగింది. స్థానిక సమస్యలు నా దృష్టికి చెచ్చారు వాటిని పరిష్కరించాలని, త్రాగునీరు, మురికి కాలువలు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు వెంటనే అవన్ని పరిష్కరించడం జరుగుతుది. సంబందిత అధికారులకు వెంటనే పరిష్కరించమని చెప్పడం జరిగింది.

మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను లబ్దీదారు కృతజ్ఞతలు తెలిపారు అడుగడుగునా మంగళ హారతులు పట్టి వారి అభిమానం చాటుకున్నారు. ఇన్ని సంక్షేమ ఫలాలు అందించిన వైసిపి ప్రభుత్వానికి అండగా ఉంటామని ముక్తకంఠంతో ప్రజలు అంటుంటే చాలా సంతోషం అనిపించింది.

ఈ కార్యక్రమంలో విజయపురం మండలం ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, రాష్ట్ర డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండలం అధికారులు, సచివాలయ సిబ్బంది, పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading