కావనూరు / ఆంధ్రప్రదేశ్, నమస్తే ఎల్లంపల్లి: నిండ్ర మండలం కావనూరు సచివాలయం పరిధిలోని కావనూరు పంచాయతీ గ్రామాలలో పడుగ వాతావర్ణం ఏర్పడింది గ్రామస్తులు సంతోషంగా ఘనస్వాగతం పలికారు. అర్హులందరికి ప్రజా సంక్షేమ పథకాలు ప్రతిగడపకీ అందజేస్తూ ప్రజల నీరాజనం అందుకుంటూ సాగింది ఈ కార్యక్రమం. ఈ సందర్బంగా ఆర్కె రోజా మాట్లాడుతూ… వారి ప్రజాప్రతినిధిగా వారి గడప ముందు నిలబడ్డ మాకు మహిళలు మంగళహారతులు పట్టారన్నారు. ప్రతి ఇంటికి మంజూరైన సంక్షేమ పథకాలను వివరిస్తూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఆద్యంతం అందరినీ పలకరిస్తూ ఒక పండుగలాగా జరిగింది. సంక్షేమ పథకాల అమలు మరియు కొత్తగా పెన్షన్స్ మంజూరు చేయడంతో ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నిండ్ర ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, రాష్ట్ర డైరెక్టర్లు , కమిటీ చైర్మన్లు, సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.