శ్రీశైలం, నమస్తే ఎల్లంపల్లి: శ్రీశైలం మాణిక్యం చెంచుగూడెంలో సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాల లేచి నివాళులర్పించడం జరిగింది. అనంతరం కొమరం భీమ్ చెంచు గిరిజన సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు వై ఆశీర్వాదం మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే., (జనవరి 3, 1831 -మార్చి 10, 1897) భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసింది. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు పూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. ఆమె ఆశయాలను కొనసాగించాలని పిలుపునిస్తూ ఈ కార్యక్రమంలో కొమరం భీమ్ చెంచు గిరిజనసంక్షేమ సంఘం నాయకులు బి జెండాలమ్మ, కుడుముల వెంకటేశ్వర్లు, భయమా, తదితరులు పాల్గొన్నారు.















































































































































































































































































































































You must be logged in to post a comment.