నవతరం

తెలుగు దినపత్రిక

జితేందర్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ సేవలు హర్షణీయం

★ ఎం.పి పి. ఎస్ పాఠశాలలో హ్యాండ్ రైటింగ్ శిక్షణా శిబిరాన్ని సందర్శించిన మండల విద్యాధికారినీ జెమిని కుమారి

★ జితేందర్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ సామాజిక సేవలు అభినందనీయం

★ ప్రభుత్వం తరుపున ఎలాంటి సహకారమైన జితేందర్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ కి అందిస్తాం: ఎమ్.ఈ.ఓ.

కుత్బుల్లాపూర్: చక్కని చేతిరాత విద్యార్థులకు మంచి మార్కులను సాధించి పెడుతాయని, ఆత్మ స్థైర్యాన్ని పెంపొందిస్తాయని కుత్బుల్లాపూర్ మండల విద్యాశాఖ అధికారిని అన్నారు. ఎం.పి.పి.ఎస్ గురుమూర్తి నగర్ లో వారంరోజుల నుండి జితేందర్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శిక్షణా శిబిరాన్ని శుక్రవారం సందర్శించి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి ఉచిత చేతిరాత శిక్షణ శిబిరాలు నిర్వహించడం హర్శించదగిన విషయమని అన్నారు. ఈ శిక్షణా శిబిరాన్ని నిర్వహించిన ఆ సంస్థ డైరెక్టర్ వంపు మల్లయ్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రయ్య, పి.ఆర్. టి. యు. టి . ఎస్ జాయింట్ సెక్రటరీ రాఘవేందర్ రెడ్డి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుదర్శన్, ఉపాద్యాయులు ధనరాజ్, దివ్య, రుఖుయా , విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading