* ‘తాండవ నృత్య హారతి‘ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్ల డెకత్లాన్ వద్ద అవని నృత్యాలయం 4వ వార్షికోత్సవం సందర్భంగా వరల్డ్ రికార్డ్స్ సాధించేందుకు నిర్వహించిన ‘తాండవ నృత్య హారతి‘ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గ్రహీత డాక్టర్ ఎన్.రవి కుమార్ శిక్షణలో 60 నిమిషాల పాటు ఆపకుండా 60 మంది శివుడి వేషధారణతో 60 యోగా ఆసనాలతో అందరినీ ఆకట్టుకున్న 80 మంది నృత్యకారులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో అవని నృత్యాలయం ఫౌండర్స్ విజెంద్ర, ధనలక్ష్మి, భారత్ వరల్డ్ రికార్డ్స్ కోఆర్డినేటర్ & నేషనల్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్స్ ఆర్గనైజేషన్స్ ఫౌండర్ ప్రెసిడెంట్ కెవి రమణ రావు, సెంట్ మైకేల్స్ స్కూల్ ఫౌండర్ డైరెక్టర్ మాథ్యూ, పియర్సన్ స్కూల్ ప్రిన్సిపల్ షాహిదా, కూచిపూడి డాన్స్ మాస్టర్ శ్రీకాంత్ గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.




















































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.