సంగారెడ్డి, నమస్తే ఎల్లంపల్లి: 317 G.O ద్వారా ఇతర జిల్లాలకు స్థానచలనం పై వెళ్ళిన ఉపాధ్యాయులకు బదిలీలల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు తెలంగాణ టీచర్స్ యూనియన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆకుల ప్రభాకర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ఉపాధ్యాయ ప్రమోషన్స్ , బదిలీల్లో 317 జీవో ద్వారా గత సంవత్సరం జిల్లాలు మారిన ఉపాధ్యాయులకు పాత స్టేషన్ పాయింట్స్ ఇచ్చి బదిలీలలో అవకాశం కల్పించాలి. 13 జిల్లాల స్పౌజ్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి. గతంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా SGT ఉపాధ్యాయులకు 10000 PSHM పోస్టులను ప్రమోషన్ రూపంలో ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వెంటనే 10000 PSHM పోస్టులను మంజూరు చేసి ఎస్జిటిలకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇట్టి ప్రమోషన్లు, బదిలీలు పారదర్శకంగా జరపాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ సంగారెడ్డి జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఆకుల ప్రభాకర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.