భద్రాచలం, నమస్తే ఎల్లంపల్లి: భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నందు గల త్రివేణి స్కూల్లోమాక్ పార్లమెంట్ న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి ప్రథమ శ్రేణి జడ్జి నీలిమ ముందుగా స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి జ్యోతిని వెలిగించి మాట్లాడుతూ పిల్లలకు చిన్నప్పటి నుంచే నీతిగా నిజాయితీగా ప్రతి విషయంలో స్కూల్ టీచర్స్ చెప్పిన విధంగా నడుచుకుంటూ అలాగే ఇంటి వద్ద తల్లిదండ్రులు మాటలకు ఎదురు సమాధానాలు చెప్పకుండా వారు చెప్పిన విధంగా మలుచుకుంటూ క్రమశిక్షణతో కూడినటువంటి చదువుని చదువుకోవాలని చిన్ననాటి నుంచి పిల్లలకి న్యాయపరమైన మంచి చెడులు గురించి పిల్లలకి అర్థం అయ్యే రీతిలో వివరించారు. ఈ కార్యక్రమం గూర్చి స్కూల్ ప్రిన్సిపాల్ జంగాల మంజుల మాట్లాడుతూ పిల్లలకు చిన్ననాటి నుండి న్యాయపరమైన మంచి చెడులు గురించి నీతిగా నిజాయితీగా ఉండే విధంగా అదేవిధంగా అబద్ధాలు ఆడకూడదని ఎట్టి పరిస్థితుల్లో టీచర్స్ తో గాని పేరెంట్స్ తో గాని ఉపాధ్యాయులు తో గాని తల్లిదండ్రులు తో గాని ఎట్టి పరిస్థితుల్లో అబద్దాలు ఆడకూడదని నిజాలే మాట్లాడాలని అన్నారు. కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రథమ శ్రేణి జడ్జ్ నీలిమతో చెప్పించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కానుమిల్లి విమలాదేవి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బాబురావు సార్, అక్డ మిక్ ఇంచార్జ్ నరేష్, క్యాంపస్ ఇంచార్జ్ సందీప్ రెడ్డి, తోటి అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.