నవతరం

తెలుగు దినపత్రిక

జోగు నిర్మలకు అభినందనలు

* పట్టు పట్టే రెండు జాబ్స్ కొట్టే
* గురుకుల టీజీటీ, డిఎస్సి లాంగ్వేజ్ పండిట్ కు ఎంపికైన జోగు నిర్మల
* అక్షరమే ఆయుధంగా విజయం ఆమె సొంతం
* జోగు నిర్మల కి అభినందనల వెల్లువ
* పట్టు వదలకుండా ఏకకాలంలో రెండు కొలువులు
* మహిళలకు ఆదర్శంగా, యువతకు స్ఫూర్తిగా
* ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన జోగు నిర్మల
* అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్న విజేత

హైదరాబాద్: తన మేనమామ జోగు రామచంద్రు ఆలోచనని అడుగుజాడల్ని అందిపుచ్చుకొని మేనమామ ఆదర్శమే ఆయుధంగా మల్చుకొని ముందుకు సాగి రెండు కొలువులు సాధించడంతో విజయం ఆమె సొంతమైంది. తన భర్త జోగు వెంకట్ తన తల్లిదండ్రుల కలలను నిజం చేసింది. ఎంచుకున్న లక్ష్యం కోసం ఎన్ని అవరోదాలు ఎదురైనా పట్టుదలతో శ్రమిస్తే విజయం సాధించవచ్చునని నిరూపించింది జగద్గిరిగుట్ట కు చెందిన జోగు నిర్మల. చిన్ననాటి నుండే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కని అనేక ఇబ్బందులు ఎదుర్కొని తన కల సాకరం చేసుకుంది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి పరీక్షలో ఉత్తిర్ణత సాధించి తెలుగు లాంగ్వేజ్ పండిట్ గా ఎంపికైంది. ఒకటి నుండి ఐదో తరగతి వరకు జగద్గిరిగుట్ట రిక్షాపుల్లర్ కాలనీ ప్రైవేట్ పాఠశాలలో చదివి గురుకుల ఆరో తరగతి ప్రవేశ పరీక్ష రాసి మహేంద్రహిల్స్ సీట్ సంపాదించి ఆరు నుండి పదోతరగతి వరకు మహేంద్ర హిల్స్ గురుకుల పాఠశాల లో ఇంటర్ మీడియట్ గౌల్లిదొడ్డి గురుకుల కళాశాల లో చదివి, డిగ్రీ బేగంపేట్ ప్రభుత్వ కళాశాల లో, పీజి సూర్యాపేట లో, సాహితి కాలేజ్ తిరుమలగిరి లో బిఈడి పూర్తి చేసింది. అనేక ఆర్ధిక ఒడిదుడుకులను అధిరోహించి భర్త జోగు వెంకట్ (జర్నలిస్ట్) సహకారంతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించింది. చేవెళ్ల షాబాద్ లో గురుకుల టీచర్ గా పనిచేస్తూ నేడు తెలుగు పండిట్ గా ఎంపికై బుధవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా నియామకపత్రం అందుకుంది.మేడ్చల్ జిల్లా లో తెలుగు పండిట్ పోస్ట్ ఒకటే ఉండగా ఆ పోస్ట్ దక్కించుకున్న ఘనత నిర్మలకకు దక్కింది.

ప్రభుత్వ ఉద్యోగ బియామకపత్రాన్ని చూపుతున్న జోగు నిర్మల

హర్షం వ్యక్తం చేసిన స్థానికులు

జోగు నిర్మల ప్రభుత్వ తెలుగు పండిట్ గా ఎంపికవడం పట్ల కుటుంబ సభ్యులు, స్థానికులు హర్షం వ్యక్తం చేసారు. తమ ప్రాంతానికి చెందిన నిర్మల తమకు గౌరవం తెచ్చేలా ప్రభుత్వ ఉద్యోగం సాధించడం హర్షనీయం అని అన్నారు. వివాహం అయి 20 ఏళ్ళు అయినా తన పట్టు వదలని ఆకుంఠిత దీక్షతో ప్రభుత్వ ఉద్యోగం సాదించాలనే లక్షాన్ని చేరుకుని ఎందరికో ఆదర్శం గా నిలిచిందని కొనియాడారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading