* వైకల్యాన్ని జయించి.. అనుకున్న లక్ష్యాన్ని సాధించిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ
* సూరారంలో లూయిస్ బ్రెయిలీ 214వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం లూయిస్ భవనంలో ఏర్పాటు చేసిన లూయిస్ బ్రెయిలీ 214వ జయంతి వేడుకల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గ దయాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారితో కలిసి బ్రెయిలీ క్యాలెండర్ ను ఆవిష్కరించి, కేక్ కట్చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ లూయిస్ బ్రెయిలీ వైకల్యాన్ని జయించి, అనుకున్న లక్ష్యాన్ని సాధించిన మహనీయుడని కొనియాడారు. దివ్యాంగులకు రూ.3,116/- పింఛన్ ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం, వారి అభ్యున్నతి కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయడం దేశానికే ఆదర్శమన్నారు. దివ్యాంగులైన వారు సమాజంలో అందరితో సమానులేనని పేర్కొన్నారు. త్వరలోనే దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద బ్లైండ్ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ ప్రెసిడెంట్ విసి వీర రాఘవన్, వెల్ఫేర్ అసోసియేషన్ డిసేబుల్డ్ ప్రెసిడెంట్ జి.అంజయ్య, సారా ప్రవీణ్ కుమార్ గౌడ్, స్థానిక డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్, సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మన్నె రాజు, రవీందర్ ముదిరాజ్, వెంకటస్వామి, పందిరి యాదగిరి, రాజ్ కుమార్, తారా సింగ్, లూయిస్ బ్రెయిలీ సూరారం అసోసియేషన్ సభ్యులు సత్యం, ఎస్.రాజ్ కుమార్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సూరారంలో లూయిస్ బ్రెయిలీ 214వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్.
వైకల్యాన్ని జయించి.. అనుకున్న లక్ష్యాన్ని సాధించిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ.






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.