హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ రుద్ర స్టూడియో రుద్ర శ్రీనివాస్ ఇస్తున్న అవార్డు సామాజిక కార్యకర్తలకు, కవులకు, సినీ పరిశ్రమ మూవీ ఆర్టిస్ట్, సీరియల్ ఆర్టిస్ట్ లు, యాంకర్స్ లకు ఇచ్చే అవార్డుకు నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం జాల్ తండాకు చెందిన “గిరిజన ప్రజా సమాఖ్య తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు యువకవి, సామాజిక కార్యకర్త, గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు గ్రహీత “జటావత్ మునినాయక్” ని న్యూ ట్యాలెంట్ అవార్డ్ కు ఎన్నిక చేశామని శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అనేక రంగాలలో సామాజిక సేవలను అందిస్తూ 2000 పై స్టూడెంట్స్ కి సమాచారం అందిస్తూ ఒక మోటివేషన్ స్పీకర్ ల అన్నే కార్యక్రమాలు నిర్వహిస్తూ “సినిమా రంగంలో ఉన్న ప్రముఖుల సైతం మెచ్చుకునే కార్యక్రమాలు చేయడం అంత చిన్న వయసులో ఇంతటి కార్యక్రమాలు చేయడం చాల ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమం “22 జనవరి 2023 నాడు శ్రీ సత్య సాయి నిగమమ్ శ్రీ నగర్ లో జరుగుతుంది, “ముని నాయక్” మాట్లాడుతూ ఈ అవార్డు కి ఎన్నికవడం చాల ఆనందాన్నిచ్చిందన్నారు. ఎక్కడో పల్లెలో ఉండే నేను ఈ స్థాయికి రావడం చాల ఆనందాన్నిచ్చిందన్నారు. ఈ అవార్డు సంతోషంతో పాటు మరెన్నో బాధ్యతలను తెచ్చిపెట్టిందన్నారు. మునినాయక్ ను ప్రముఖులు, కార్యకర్తలు, స్నేహితులు తదితరులు అభినందించారు.






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.