74 గణతంత్ర దినోత్సవ సందర్భంగా పలు వడ్డెర కాలనీలో జెండా ఆవిష్కరణ చేసిన వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తరి మారయ్య
మేడ్చల్ జిల్లా బ్యూరో, నమస్తే ఎల్లంపల్లి: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపుర్ నియోజకవర్గంలో గాజుల రామారం డివిజన్ 74 గణతంత్ర దినోత్సవ సందర్భంగా పెద్దమ్మ నగర్, బాలయ్య నగర్, మితుల నగర్, దేవేంద్ర నగర్ కట్ట మైసమ్మ, కైసర్ నగర్, జగద్గిరిగుట్ట బస్టాండ్ ప్రాంతాలలో ఏర్పాటుచేసిన జండా కార్యక్రమంలో పాల్గొని జెండాలను ఎగరవేయడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అఖిలభారత వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తరి మారయ్య మాట్లాడుతూ గణతంత్ర దేశంగా 74 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప మా యొక్క వడ్డెర స్థితిగతులను పట్టించుకునే ప్రభుత్వాలు ఇప్పటివరకు చూడలేవని అన్నాడు. ఇకనుండి అయిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా యొక్క వడ్డెరల జీవిత ఆధారమైన వృత్తిని ప్రస్తుత కాలంలో కనుమరుగైపోతుంది, యాంత్రికరణ ప్రపంచీకరణ నేపథ్యంలో నూతన యంత్రాలు పరికరాలు ఏర్పడి చేతివృత్తి అయిన వడ్డెర వృత్తి కనుమరుగైపోతుంది. ప్రభుత్వాలు దయుంచి మా వడ్డెర కులానికి ఆధారమైన యంత్రాల కొనుగోలు విషయంలో క్వారీలు, కాంట్రాక్టు, విద్య, ఉద్యోగ విషయంలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇకనుండి రాష్ట్రంలో ఉన్న వడ్డెర అన్ని సంఘాలు ఏక తాటిపై కొచ్చి ఓకే సంఘం గా ఉండి రాష్ట్రంలో ఉన్న వడ్డెర ల కోసం పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం రాష్ట్ర నాయకుడు ఎత్తరి గణేష్, దండుగుల రామకృష్ణ, సూర సాయి, నవీన్, ఇరగొట్టి తిరుపతి, నగేష్, దెరంగుల శ్యామ్, రాములు, శ్రీను, ముత్తు మహిళలు, కాలనీలా వడ్డెరలు తదితరులు పాల్గొన్నారు.





















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.