నవతరం

తెలుగు దినపత్రిక

ఆలయ ధర్మకర్తను, ఆలయ కమిటీ ని అభినందించిన కేఎం ప్రతాప్

కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 7 (నవతరం): జీడిమెట్ల డివిజన్ పరిధిలోని, కుత్బుల్లాపూర్ గ్రామంలో జరుగుతున్న శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలకు, ఆలయ కమిటీ వారి ఆహ్వాన మేరకు ముఖ్యఅతిథిగా విచ్చేసి, ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించిన, రంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు, బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కె.యం. ప్రతాప్. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు ప్రతాప్ ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ, శ్రీ వేణుగోపాలస్వామి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నందుకు ఆలయ ధర్మకర్తను, ఆలయ కమిటీ వారిని అభినందించారు. శ్రీ వేణుగోపాల స్వామి దివ్య ఆశీస్సులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలలందరిపై వుండాలని వేడుకున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఠాగూర్ విజయేందర్ సింగ్, ఆలయ కమిటీ సభ్యులు పెద్ది మల్లేశం, రత్నం మురళి గౌడ్ పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading