నవతరం

తెలుగు దినపత్రిక

గాజులరామారంలో కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

* శ్రీశ్రీశ్రీ నకులేశ్వరి దేవి సిద్దిపీఠం ఫౌండర్ చైర్మన్ నందుస్వామి.

కుత్బుల్లాపూర్: నవంబర్ రెండవ తేది నుండి ఆరవ తేది వరకు గాజులరామారంలోని భారత్ పెట్రోల్ పంపు పక్కన కైలాస్ హిల్స్ లో కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శ్రీశ్రీశ్రీ నకులేశ్వరీ దేవి సిద్దిపీఠం చైర్మన్ నందు స్వామి ఒక ప్రకటనలో తెలియజేశారు. నవంబర్ రెండవ తేదీ నుండి ఆరవ తేదీ వరకు రోజు సాయంత్రం 6 గంటల నుండి అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. ఇట్టి కార్యక్రమానికి భక్తుల నుండి అశేష ఆదరణ లభిస్తున్నట్టు ఆయన హర్షం వ్యక్తం చేశారు. కావున భక్తాగ్రేసరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని దేవుని కృపకు ఆరాధ్యులు కాగలరని ఆయన అన్నారు. కోటి దీపోత్సవం విజయవంతం కావడానికి అహర్నిశలు శ్రమిస్తున్న శివారెడ్డి, అఖిలేశ్వర్, శ్రావణ్ కుమార్, శివకుమార్, రవితేజ శర్మ, లలిత్ రాజ్, సాయిరాంచేస్తున్న సేవలను ఆయన కొనియాడారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading