నవతరం

తెలుగు దినపత్రిక

సత్తెమ్మతల్లి ఆలయానికి నూతన వైభవం

* దాతల సాయంతో పాపిడి గూడెం వార్డు మెంబరు గుడికి రేకుల సాయం
నవతరం, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలం, పాపిడి గూడెం గ్రామం వద్ద వెలసిన సత్తెమ్మ తల్లి అమ్మవారి గుడి అభివృద్ధి పనుల నిమిత్తం ఆ గ్రామ వార్డు మెంబరు ఆళ్ళ రాంబాబు దాతల సాయంతో అమ్మవారికి నూతన వైభవాన్ని చేకూర్చారు. ఎంతో కాలంగా గుడి ప్రాంగణం చెత్తాచెదారాలతో నిండిపోయి ఉండడంతో, శుభ్రం చేసి గుడి పైకప్పునకు పాత రేకులు తీసివేసి కొత్త రేకులు వేయడం జరిగింది. నూతన సంవత్సరం అమ్మవారి ఆలయ ప్రాంగణం నూతన వైభవంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇట్టి పనిని అశ్వరావుపేట మండల వ్యాప్తంగా అక్కడకు విచ్చేయుచున్న భక్తులు వార్డు మెంబర్ ను ప్రశంసించారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading