నవతరం

తెలుగు దినపత్రిక

జనం బాటలో జాగృతి

హైదరాబాద్: జాగృతి జనం బాటలో భాగంగా నల్గొండ జిల్లాలో
డిండి లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలోని కిష్టరాయినిపల్లి రిజర్వాయర్ ను సందర్శించి కిష్టరాయినిపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల నిర్వాసితులను కలిశారు ఎమ్మెల్సీ కవిత. అనంతరం ఆమె మాట్లాడుతూ… డిండి లిప్ట్ ఇరిగేషన్ పూర్తైతే వేలాది మందికి లాభం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రాంతం చుట్టు పక్కల ప్రజలు పెద్ద మనసు చేసుకొని తమ భూములను ఇచ్చారు అన్నారు. 2015 లోనే తొందరగా ప్రాజెక్ట్ పూర్తై ఉంటే సమస్యలు ఉండకపోయేవి. దాదాపు 11 ఏళ్లు ఆలస్యమైంది. దీంతో అప్పుడు 18 ఏళ్లు నిండని చాలా మందికి ఇప్పుడు 18 ఏళ్లు దాటాయి. వారికి కూడా పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. అప్పుడున్న ధరలకు ఇప్పుడున్న ధరలకు చాలా తేడా ఉంది. అంతే కాకుండా నిర్వాసితులకు ఇళ్లు గానీ వేరే కాలనీలు గానీ కట్టించలేదు. ప్రభుత్వం వెంటనే నిర్వాసితులకు తగిన పరిహారం ఇవ్వాలి లేదంటే ఇక్కడ యువతతో కలిసి హైదరాబాద్ లో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యాచరణ చేస్తామన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading