నవతరం

తెలుగు దినపత్రిక

మనువాదం పై ఎక్కుపెట్టిన కలమే ఎర్ర ఉపాలి

• ఎర్ర ఉపాలికి నివాళులర్పించిన ప్రజా సంఘాలు, జర్నలిస్టులు
• మాదిగల దిక్కారస్వరమే ఎర్రఉపాలి: దరువు అంజన్న

కుత్బుల్లాపూర్: మహా ఆది జాంబవుని వారసుడు, మాదిగ జాతి దిక్కర స్వరం ఎర్ర ఉపాలి అని పలువురు ప్రజా సంఘాల నాయకులు మరియు జర్నలిస్టులు  కొనియాడారు. ఎర్ర ఉపాలి జీవితం ప్రజలకు అంకితమని, తను జీవించి ఉన్నన్ని రోజులు ప్రజల కొరకు పాటుపడ్డాడని, మానవజాతి ఔన్నత్యానికై… మాదిగ జాతి హక్కులకై ఎడతెరిపిలేని యుద్ధం చేసిన వీరుడు ఎర్ర ఊపాలి అని, తను జీవించి ఉన్నన్ని రోజులు ప్రజల కొరకు పాటుపడ్డాడని, మానవజాతి ఔన్నత్యానికై, మాదిగ జాతి హక్కులకై ఎడతెరిపిలేని యుద్ధం చేసిన మహనీయుడు  ఎర్ర ఉపాలని కొనియాడారు. కుత్బుల్లాపూర్ గాజులరామారంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ టూరిజం మరియు సాంస్కృతిక శాఖ సలహాదారులు దరువు అంజన్న, తెలంగాణ ఉద్యమకారులు, ప్రజాకవి మోహన్ బైరాగి, దుడ్డు రాహుల్, జర్నలిస్టులు డా. ఎల్లంపల్లి నర్సింలు, తొండ వెంకట్, నామమోహన్, డప్పు రామస్వామి, జుట్టు సాయిలు, సాయిరాజ్, ముత్యపాగ శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading