నవతరం

తెలుగు దినపత్రిక

సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్సీ కి వినతి

రిసోర్స్ పర్సన్స్ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కు వినతి

మేడ్చల్ జిల్లా బ్యూరో, నమస్తే ఎల్లంపల్లి: మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం సర్కిల్ కు చెందిన రిసోర్స్ పర్సన్స్ (ఆర్. పీ) లు ఈరోజు శంభీపూర్ లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్సీ సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, సురేష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆర్. పీ యూనియన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading