నవతరం

తెలుగు దినపత్రిక

బిజెపి కార్యకర్తపై బాబు మోహన్ తిట్ల పురాణం

*బిజెపి కార్యకర్త పై విరుచుకుపడ్డ బాబు మోహన్
* సోషల్ మీడియాలో వైరల్ గా మారిన బాబు మోహన్, వెంకటరమణ ఆడియో కాల్
* ఆడియో కాల్ ఎవరిదో అంటూ వివరణ ఇచ్చిన బాబు మోహన్
* అవసరమైతే ఆయనేకే కాల్ చేసి అడగండి అంటూ సమాధానం
* ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఇవన్నీ చేపిస్తున్నాడంటున్న బాబు మోహన్

అందోల్, నమస్తే ఎల్లంపల్లి: ఆందోల్ నియోజకవర్గం బిజెపి కార్యకర్త వెంకటరమణ పై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి బాబు మోహన్. నువ్వెంత నీ బతుకెంత అంటూ ఫోన్లో వెంకటరమణ పై రెచ్చిపోయారు బాబు మోహన్. నువ్వు ఏ స్థాయి కార్యకర్తవు నీ వద్ద ఎన్ని ఓట్లు ఉన్నాయి, నువ్వు మళ్ళీ నాకు ఫోన్ చేయొద్దు అంటూ కించపరిచే ప్రయత్నం చేశారు. ఈ ఫోన్ కాల్ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది… ఈ ఫోన్ కాల్ పై స్పందించిన బాబు మోహన్ సీనియర్ జర్నలిస్టు ఎల్లంపల్లి నర్సింలు తో మాట్లాడుతూ… ఆడియో కాల్ ఎవరిదో నాకు తెలవదు, ఆ వెంకటరమణ ఎవరో నాకు ఇప్పటివరకు తెలియదంటూ వివరణ ఇచ్చారు. ఆ ఫోన్ కాల్ ఎవరిదో కూడా నాకు తెలియదు అంటూ వెంకటరమణ కూడా నాకు తెలియదు అంటూ ఏమీ తెలియనట్టు సమాధానం చెప్పారు బాబు మోహన్. ఈ ఆడియో కాల్ పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading