* కుత్బుల్లాపూర్ లో రెచ్చిపోతున్న భూకబ్జాదారులు
* ఖాళీ జాగా కనిపిస్తే చాలు, అమ్మి సొమ్ము చేసుకుంటారు
* వీఆర్వో వ్యవస్థ రద్దు చేయటమే ప్రధాన కారణమా?
* కుదిరితే కబ్జాలు, లేకపోతే భౌతిక దాడులు
* అడ్డుకున్నవారిపై పైశాచిక దాడులకు పాల్పడుతున్న కబ్జాకోరులు
* రెవెన్యూ అధికారులు స్పందించాలంటున్న స్థానిక ప్రజలు
కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండల పరిధిలో జోరుగా అక్రమ నిర్మాణాలు ప్రభుత్వ భూముల్లో వెలుస్తున్నాయి. గాజులరామారం, మెట్టకాని గూడా, సూరారం లోని పలు సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూములను అన్ని సొమ్ము చేసుకుంటున్నారు కబ్జాదారులు. ప్రధానంగా మెట్టకానికి కూడా లోని సర్వే నంబర్ 79 లో బరితెగించిన భూకబ్జాదారులు పట్టపగలే ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపడుతున్నారు. గత వారం రోజులుగా ఇక్కడ వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై స్పందించిన స్థానిక రెవెన్యూ అధికారులు పాక్షిక కూల్చివేతలు జరిపారు. దీనికి ప్రధాన కారణం రెవెన్యూ అధికారులకు పోలీస్ ప్రొటెక్షన్ లేకపోవడమేనంటున్నారు స్థానిక ప్రజలు. ఈ అక్రమ నిర్మాణాలు, కూల్చివేతలపై కుత్బుల్లాపూర్ తాసిల్దార్ సంజీవరావు నవతరం విలేకరితో మాట్లాడుతూ… మెట్టకాని గూడలో వెలసిన అక్రమ నిర్మాణాలకు కూల్చివేతకు మేము వెళ్ళినప్పుడు నిర్మాణదారుల నుండి మాకు కొంత ఇబ్బంది ఎదురయింది, అందుకే పాక్షికంగా కూల్చివేతలు చేసి వచ్చాము, మిగతావి కూడా పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుని కూల్చివేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే కుత్బుల్లాపూర్ మండల పరిధిలో భూ కబ్జాలకు పాల్పడిన కొందరిపై కేసులు కూడా నమోదు చేశామన్నారు.

భగత్ సింగ్ నగర్ లో…
కుత్బుల్లాపూర్ రెవెన్యూ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న భగత్ సింగ్ నగర్ లో రెచ్చిపోతున్న భూకబ్జాదారులు ప్రభుత్వ భూములను ఆక్రమించి అమాయక పేద ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అంతటితో ఆగకుండా పట్టా పగలు అర్ధరాత్రి అని తేడా లేకుండా ఇక్కడ ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. అయినా కూడా రెవెన్యూ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయిబాబా నగర్ చౌరస్తా… మెయిన్ రోడ్డు పక్కనే ఓ వ్యక్తి కొత్త పగలు బేస్మెంట్ నిర్మించినా, ఏ ఒక్క అధికారి అటువైపు వెళ్లిన దాఖలాలు లేవు. మరో వ్యక్తి బండల షాపులో మాటున ఏకంగా 100 గజాల్లో పూర్తి ఇంటిని నిర్మించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే సుమారు 50 కి పైగా ఇండ్లు గత నెల రోజుల్లో ఇక్కడ వెలిశాయంటే అతిశయోక్తి కాదు. ఇంతగా బరితెగిస్తున్న ఇక్కడి భూకబ్జాదారులపై ఇకనైనా రెవెన్యూ అధికారులు స్పందించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి ప్రభుత్వ భూములను కాపాడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

You must be logged in to post a comment.