అలంపూర్, ఫిబ్రవరి 5 (నమస్తే ఎల్లంపల్లి): ఈనెల 17వ తేదీ నుండి 21వ తేదీ వరకు అలంపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అంశాలపై ఆలయ అర్చకులతో శనివారం సాయంత్రం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి పురేందర్ కుమార్ సమీక్ష నిర్వహించారు. మహాశివరాత్రి రోజు ప్రతి భక్తుడు లింగాభిషేకం చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. బాల బ్రహ్మేశ్వర స్వామి వారి గర్భాలయంలో సాంప్రదాయ దుస్తులతోనే వెళ్లి అభిషేకం చేసే అవకాశం ఉంటుందని అన్నారు. సాంప్రదాయ దుస్తులు అందుబాటులో లేని భక్తుల కొరకు క్యూ లైన్ దగ్గర తాత్కాలిక స్వర్ణ లింగాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఇద్దరు అర్చకులను అందుబాటులో ఉంచి స్వర్ణ లింగానికి అభిషేకం చేసి వారికి అభిషేక ఫలితాన్ని అందజేసేలా ఏర్పాటు చేస్తామని సూచించారు. ఇక ఐదు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో ఎక్కడెక్కడ ఎంతమంది అదరపు అర్చకులు కావాలో అడిగి తెలుసుకున్నారు వారిని డిప్యూటేషన్ పై ఇతర ఆలయాల నుంచి డ్యూటీ అలర్ట్ చేయించి బ్రహ్మోత్సవాలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు ఆనంద్ శర్మ, ముఖ్య ఆర్చకుడు వనం శ్రీకాంత్ శర్మ, ధనుంజయ శర్మ, త్యాగరాజ శర్మ, కృష్ణమూర్తి శర్మలు ఉన్నారు.






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.