నవతరం

తెలుగు దినపత్రిక

బీఆర్ఎస్ నేతను పరామర్శించిన శంభీపూర్ రాజు

కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: దుండిగల్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు శివకుమార్ యాదవ్ బుధవారం రాత్రి దుండగుల చేతిలో గాయపడి చింతల్ లోని ఆర్ఎన్సీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఉదయం హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించారు. దాడి జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకొని ధైర్యంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్, కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, జగన్, బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గం యూత్ అధ్యక్షులు సోమేశ్ యాదవ్, గాజులరామారం డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading