నవతరం

తెలుగు దినపత్రిక

జీడిమెట్ల డివిజన్ ప్రసూన నగర్ కాలనీలో ఎమ్మెల్యే పాదయాత్ర

‘ప్రగతి యాత్ర’ లో భాగంగా 42వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

రూ.1.90 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేసినందుకు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన ప్రజలు…

కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: జీడిమెట్ల డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 42వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రసూన నగర్ కాలనీలో పాదయాత్ర చేస్తూ దాదాపు 90 శాతం పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించారు. మిగిలి ఉన్న చిన్నపాటి సమస్యలు తెలుసుకొని.. అక్కడే ఉన్న అధికారులకు ఆదేశించారు. వరద నీటి సమస్య లేకుండా నాలా పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో అనేక సమస్యలతో సతమతమైన తమ ప్రాంతంలో రూ.1.90 కోట్లతో సహకారం అందించి రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి వసతులు కల్పించినందుకు ప్రజలు ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ సుబ్బారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్, వైస్ ప్రెసిడెంట్ సర్వేశ్ కుమార్, లక్ష్మణ్ గౌడ్, జనరల్ సెక్రెటరీ గోపాల్ రెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీలు సాంబశివరావు, రవీందర్, అనిల్ కుమార్, రవికుమార్, సిద్ధులు గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, చంద్రయ్య, అర్జునరావు, శ్రీనివాస్, ట్రెజరర్ రామకృష్ణారెడ్డి, చీఫ్ అడ్వైజర్ నాగేంద్రబాబు, అడ్వైజర్ శంకర్, నారాయణ, నాగేశ్వర్ రావు మరియు డిఈఈ భాను చందర్, ఏఈ సురేందర్ నాయక్, డిజిఎం రాజేష్, వార్డు సభ్యుడు సుధాకర్ గౌడ్, సీనియర్ నాయకులు కుంట సిద్ధిరాములు, జ్ఞానేశ్వర్, నరేందర్ రెడ్డి, కాలే నాగేష్, నదీమ్ రాయ్, కాలే గణేష్, విజయ్ హరీష్, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading