నవతరం

తెలుగు దినపత్రిక

ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తా

* నేచర్ స్పేస్ వెంచర్ లో తలెత్తినటువంటి డ్రైనేజీ సమస్యపై పర్యటించిన పుప్పాల భాస్కర్

కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని సూరారం డివిజన్ నేచర్ స్పేస్ వెంచర్ లో తలెత్తినటువంటి డ్రైనేజీ సమస్యపై స్థానిక డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, ప్రధాన కార్యదర్శి సిధిక్ కాలనీ వాసులతో కలిసి పర్యటించారు. దాదాపు 100కు పైగా ఉన్నటువంటి కుటుంబాలు డ్రైనేజీ అవుట్లైట్ లేక ఇబ్బందులు పడుతున్నందుకు వారి యొక్క సమస్యను తక్షణమే స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో HMWSSB మేనేజర్ రవి, విటల్, వెంకట్ రెడ్డి, మూర్తి, గోపాల్ రెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading