నవతరం

తెలుగు దినపత్రిక

స్పష్టత ఇచ్చేది ఎవరు

* మైనార్టీలకు లక్ష సహయంపై స్పష్టత ఇచ్చేది ఎవరు
* కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్

భద్రాద్రి జిల్లా, ఆగష్టు 4 (నమస్తే ఎల్లంపల్లి):రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పదేళ్లలో గుర్తుకురాని ముస్లిం మైనార్టీలు త్వరలో ఎన్నికలు సమీపిస్తున్నాయి అని ముస్లిం మైనార్టీల ఓట్లను దండుకునే ప్రయత్నంలో భాగంగానే లోన్ల హడావుడి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలను జీవో 78 పేరుతో మోసం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జీవోలో స్పష్టంగా పాయింట్ నెంబర్ 2 గైడ్ లైన్స్ లో చెప్తున్నారు ఫస్ట్ అప్లికేషన్స్ ఉట్టి క్రిస్టియన్ మైనార్టీలకే మరి ముస్లింల రెండు లక్షల పదహారువేల పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి. మరి అందరికీ ఇస్తున్నారా, ఎన్ని రోజుల్లో ఇస్తారు, ఎంత ఇస్తారు అనేది స్పష్టత లేదు మరి పాత రెండు లక్షల 16 వేల అప్లికేషన్స్ ఉన్నాయి ఆ అప్లికేషన్స్ రద్దు చేస్తారా అన్నది తెలియని పరిస్థితి. వీటిపై రాష్ట్ర మైనార్టీ మినిస్టర్ కొప్పుల ఈశ్వర్ ఎక్కడ ఉన్నారు ముందుకు రావాలి పూర్తి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రుణాలు ఇస్తామని ఉట్టి కల్లి బోల్లి మాటలు చెప్తే మీ మాటలను నమ్మి ముస్లింలు అయోమయంగా ఏం చేయాలో అర్థం కాక మీసేవ లలో ఆన్లైన్లో అప్లై చేసుకోవటానికి, జిల్లా మైనార్టీ అధికారులను కలవటానికి మొదలగు వాటికై ఒక్కొక్కళ్ళు వెయ్యి రూపాయలు నుండి 1500 వరకు ఖర్చు చేసుకుంటున్నారు. ముస్లింలకు తెలియజేసేది ఏమిటంటే జీవో పాత అప్లికేషన్ పెట్టుకున్నా వారికే రుణాలు మంజూరు చేస్తాం అంటున్నారు కానీ ఇంత ఇస్తాము అంత ఇస్తాము అనేది స్పష్టత లేదు, జిల్లా మైనార్టీ అధికారులు స్పష్టం గా తెలియపరచాలి .ఈ జీవో ప్రకారం ఎంతమంది ముస్లింలకు సబ్సిడీ రుణాలు ఇస్తారు అనేది స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భద్రాచలం కాంగ్రెస్ పార్టీ పట్టణ మైనారిటీ అధ్యక్షుడు ఆరిఫ్, పట్టణ ప్రధాన కార్యదర్శి బాబాజీ తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading