నవతరం

తెలుగు దినపత్రిక

మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా

* ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద బాచుపల్లి కి చెందిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులు దాదాపు యాభై మంది ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ను కలిసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద నెలకొని ఉన్న భూగర్భ డ్రైనేజీ, మంచినీటి సౌకర్యం, ప్రహరీ గోడ నిర్మాణం, కరెంటు సమస్యలను తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు మౌలిక వసతులైన భూగర్భ డ్రైనేజీ, మంచినీటి సౌకర్యం, కరెంటు వసతులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు నదీమ్ రాయ్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు అశోక్, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading