రాజీవ్ గృహకల్ప స్థలాలను, చిరు వ్యాపారుల షాపులను కాపాడాలని కలెక్టర్ కి, ఎమ్మెల్యే కి వినతి పత్రాలు అందజేసిన ఆర్జీకే నాయకులు
కుత్బుల్లాపూర్, అక్టోబర్ 24: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్, రాజీవ్ గృహకల్ప సముదాయానికి సంబందించిన సర్వేనెంబర్ 348/1 లోని స్థలాలని కాపాడాలని ఆర్జీకే నాయకులు గురువారం జిల్లా కలెక్టర్ కి, స్థానిక ఎమ్మెల్యే కేపీ. వివేకానంద గౌడ్ కి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ఆర్జీకే సముదాయ లబ్ధిదారుల అవసరాల నిమిత్తం కేటాయించిన స్థలాలను ప్రక్క డివిజన్ గాజులరామారం 125 కి సంబందించిన లెలీన్ నగర్ సంక్షేమసంఘం నాయుకులు కబ్జాలకుపాల్పడుతూ అందినకాడికి దండుకుంటున్నారని అన్నారు.గతంలో గుడి పేరుతో ఆర్జీకే సముదాయానికి సంబందించిన సెప్టిక్ ట్యాంక్ ను ధ్వంసం చేసి కబ్జాలకు పాల్పడ్డారని తెలిపారు. ప్రస్తుతం ఆర్జీకే సముదాయంలోని చర్చి ప్రక్కన, బతుకమ్మ కుంట సమీపంలో, 54 వ బ్లాక్ ప్రక్కన గల ఆర్జీకే స్థలాలను కబ్జాలు చేస్తున్నారని అన్నారు. రాజకీయ పలుకుబడితో ఆర్జీకే స్థలాలను లెలీన్ నగర్ పేరుతో సూచిస్తూ ప్రభుత్వ నిధులను మంజూరు చేయించి ప్రహరీ గోడ నిర్మాణపనులు చేపడుతున్నారని అన్నారు.కాబట్టి ఇట్టి నిర్మాణ పనులను వెంటనే నిలిపివేసి ఆర్జీకే లబ్ధిదారులకు న్యాయం చేయాలనీ,ప్రభుత్వ అభివృద్ధి పనులను ఆర్జీకే పేరుతో నిధులు మంజూరుచేసి ఆర్జీకే సముదాయ ప్రజలకు చెందేవిదంగా అభివృద్ధి పనులు చేపట్టాలని వినతిపత్రంలో కోరినట్లు తెలిపారు. అంతే కాకుండా రాజీవ్ గృహకల్ప సముదాయానికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుటుంబాలకు సంబంధించిన నిరుపేదలు రాజీవ్ గృహకల్ప స్థలం సర్వేనెంబర్ 348/1 లో వార్డ్ కార్యాలయం పక్కన, అంబేద్కర్ భవన స్థలం కేటాయింపు ముందు, మసీదు ఎదురుగా గల రోడ్డు ప్రక్కన నిరుపేదలు గత 13 సంవత్సరాలనుండి వారి జీవనోపాధి కోసం చిన్న చిన్న షాపులు ఏర్పాటు చేసుకొని చిరు వ్యాపారాలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారన్నారు. ప్రస్తుతం వారి పొట్టమీద కొట్టే విధంగా షాపులను తొలగించి జిహెచ్ఎంసి ప్రభుత్వ నిధులతో ప్రహరీ గోడ నిర్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాబట్టి ఈ పనులను వెంటనే నిలిపివేసి చిరు వ్యాపారులు యెధావిధిగా వ్యాపారాలు చేసుకొని వారి జీవనాన్ని కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని అట్టి స్థలాలను వారికే కేటాయించి వారికి న్యాయం చేయాలని వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు.





















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.