నవతరం

తెలుగు దినపత్రిక

ఏకమైన 38 ముదిరాజ్ సంఘాల నేతలు

* బేగంపేట్‌లోని టూరిజం ప్లాజాలో ముదిరాజుల కీలక సమావేశం
* బీసీ గ్రూప్ “డి” నుంచి బీసీ గ్రూప్ “ఏ” కి మార్చే అంశంపై విస్తృత చర్చ
* జీవో ఎం.ఎస్.నం.15 అమలుకు ఎదురవుతున్న సవాళ్లఫై వ్యూహరచన
* సమావేశంలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రముఖులు
* బీసీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాలని సమావేశం లో ఏకగ్రీవ తీర్మానం
* నవంబర్ 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా వేడుకలను
* డిసెంబర్ 1న తొలి అమరుడు పోలీస్ కానిస్టేబుల్ కొర్రి కృష్ణస్వామి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన  సంఘం పెద్దలు

హైదరాబాద్: ముదిరాజ్ జాతి అభివృద్ధి, సామాజికంగా ముదిరాజులను బలపరచడం, రాజకీయ గుర్తింపును సాధించడం కోసం పార్టీలకు అతీతంగా ముదిరాజ్ అఖిలపక్ష సమావేశం బుధవారం హైదరాబాద్‌ బేగంపేట్‌లోని టూరిజం ప్లాజాలో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 38 ముదిరాజ్ సంఘం నాయకులు, వివిధ విభాగాలలో పనిచేస్తున్న కీలక నాయకులు,వివిధ పార్టీల నాయకులు, సామాజిక ప్రతినిధులు హాజరై పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలను తీసుకున్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రధానంగా ముదిరాజ్‌లను బీసీ గ్రూప్ “డి” నుంచి బీసీ గ్రూప్ “ఏ” కి మార్చే అంశంపై విస్తృత చర్చ జరిగింది. అంతేకాకుండా జీవో ఎం.ఎస్.నం.15 అమలుకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు సమగ్రమైన వ్యూహరచన అవసరమని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు.అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, లేనిపక్షంలో పార్టీల వారీగా రిజర్వేషన్లు కేటాయించే విధానం ప్రారంభమైతే బీసీలకు మొత్తం 56 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుందని నాయకులు డిమాండ్ చేశారు. అందులో జనాభా ఆధారంగా ముదిరాజ్‌లకు 16 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు. నవంబర్ 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, డిసెంబర్ 1న తెలంగాణలో తొలి అమరుడు అయిన పోలీస్ కానిస్టేబుల్ కొర్రి కృష్ణస్వామి జయంతిని అధికారికంగా నిర్వహించాలని సమావేశం కోరింది. అదేవిధంగా ట్యాంక్‌బండ్‌పై వీరుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ప్రతి ముదిరాజ్ తన పేరు వెంట “ముదిరాజ్” అనే తగును ఉపయోగించేలా అవగాహన కల్పించడం, ప్రతి గ్రామం నుంచి పది మంది ఫుల్‌టైమ్ కార్యకర్తలను ఎంపిక చేసి జాతి అభివృద్ధికి అంకితం చేయడం వంటి నిర్ణయాలు కూడా సమావేశంలో తీసుకున్నారు. ఈ  సమావేశానికి హాజరైన ప్రముఖులు సానుకూల సూచనలు మాత్రమే ఇవ్వాలని, సమావేశ మందిరంలో ఆహ్వానితులకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. అజెండాలోని అంశాలపై క్రమంగా చర్చిస్తూ ముదిరాజ్ సమాజ భవిష్యత్తు కోసం సమగ్ర కార్యాచరణకు ఏకగ్రీవంగా అంగీకరించారు.

మనతరం ముగిసింది వచ్చే తరానికైనా వారది కడదాం: బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్
తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. మన తరం ముగిసింది.. ఇప్పుడు ఆలస్యానికి చోటు లేదు. మన తరాలు ఎదుర్కొన్న బాధలు, అన్యాయం, అవకాశాల కొరత.. ఇవన్నీ ఇక్కడితో పూర్తి కావాలి.. వచ్చే తరానికి మనమే వారధి కడదాం, ఇప్పటిదాకా ఎవరైనా ఇస్తారేమో అని ఎదురు చూశాం, ఆ చూసే రోజులు పోయాయి…ఎదురుకాలం మనమే రాద్దాం.. దారిని మనమే వేద్దాం… ముదిరాజుల ఐక్యతే మన బలం. మన హక్కులు, మన గౌరవం, మన వర్గీకరణ.. ఇవి మనకు వరంగా లేవు, హక్కులుగా రావాలి.పార్టీలు మారినా మా లక్ష్యం మారకూడదు.. నాయకులు మారినా మన పోరాటం ఆగదు.ఇక్కడి నుంచి ప్రతి అడుగు స్పష్టంగా ఉండాలి.. ఉంటుంది.. ముదిరాజ్ ల బీసీ ఏ వర్గీకరణ కోసం, మన యువతకి అవకాశాల కోసం, మన జాతి భవిష్యత్తు కోసం, ఎవరూ నిలువలేని బలంతో ముందుకు సాగుదాం. మన తరం ముగిసింది…ఇప్పుడు మార్పు మన చేతుల్లో ఉంది. వచ్చే తరానికి వెలుగు చూపే దారి మనమే కడదాం.. మనమే నడిపిద్దాం.. అని బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పిలుపునిచ్చారు.

కాసాని వీరేష్ ముదిరాజ్ మాట్లాడుతూ…
ముదిరాజ్ సమాజానికి న్యాయం జరగాలంటే ముదిరాజులు బీసీ డి  నుండి బీసీ ఏ లోకి మార్పు అత్యవసరమని జాతీయ ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని వీరేష్ ముదిరాజ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 38 సంఘాలు ఒకే వేదికపైకి రావడం చారిత్రాత్మకమని ఆయన పేర్కొన్నారు. మన జాతి అభివృద్ధి కోసం ఇక మాటలు కాదు.. స్పష్టమైన చర్యలు కావాలంటూ పిలుపునిచ్చారు. బీసీ ఏ వర్గీకరణ మా హక్కు” అని కాసాని వీరేష్ నినదించారు. అన్నీ సంఘాలు కలిసి రావడం ముదిరాజ్ సమాజ బలాన్ని పెంచుతుందని అన్నారు. ప్రభుత్వం మన డిమాండ్‌ను సానుకూలంగా పరిగణించాలని కోరుతున్నాం” అని కాసాని వీరేష్ అన్నారు. ముదిరాజ్‌ల ఐక్యతే మన శక్తి. వర్గీకరణ మార్పు సాధించేవరకు మన పోరాటం ఆపకూడదని కోరారు. మన న్యాయమైన డిమాండ్ ను ప్రభుత్వం ముందు ఉంచుతామని ప్రభుత్వం స్పందించకపోతే ప్రతీ ముదిరాజ్ బిడ్డ మన జాతి గౌరవం కోసం మన హక్కుల సాధన కోసం స్వతంత్రం కోసం పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading