నవతరం

తెలుగు దినపత్రిక

రైతులతో కలిసి ధర్నా నిర్వహించిన ఎమ్మెల్సీ రాజు

హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రైతు కల్లాలపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ మేడ్చల్ జిల్లా కేంద్రంలో రైతులతో కలిసి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ శ్రీ సాయిచంద్ ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిధిలోని ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading