* సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ఏసురత్నం, ఉమా మహేష్
జగద్గిరిగుట్ట, నమస్తే ఎల్లంపల్లి: జగద్గిరిగుట్ట నల్లమల గిరిప్రసాద్ విజ్ఞాన కేంద్ర కార్యాలయం మైదానంలో నేడు భారత జాతీయ మహిళా సమాఖ్య మండల కార్యదర్శి హైమవతి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీకి ముఖ్యఅతిథిగా పాల్గొని ముగ్గులను చూసి బహుమతులను అందచెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది మహిళలు పాల్గొని ముగ్గులు వెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహిస్తూ సంస్కృతిని కాపాడుకుంటూ ప్రజల్లో అవగాహన తీసుకురావడం అభినందనమని మహిళలు కూడా సామాజికంగా, రాజకీయంగా ఎదగడానికి వారికి పార్లమెంట్లో 33 శాతం రెజర్వేషన్ కోసం మహిళా సమాఖ్య గా నిరంతరం పోరాటం నిర్వహించాలని కోరారు. మహిళా సమాఖ్య నిర్వహించే అన్ని కార్యక్రమాలకు సీపీఐ గా మద్దతు ఉంటుందని, రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. మొదటి బహుమతి సరిత, రెండు, మూడు బహుమతులు వినోదా,సరస్వతి లకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య నాయకురాలు సత్యవతి, పర్వీనా బేగం, కళావతి, భారతి, మీనా, సీపీఐ మండల సహాయ కార్యదర్శి దుర్గయ్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు స్వామి, నియోజకవర్గ అధ్యక్షుడు హరినాథ్, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు ప్రవీణ్, సీపీఐ నాయకులు వెంకటేష్, సదానంద, రాములు, సహదేవ్ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ నాయకులు శివ, నర్సయ్య, శ్రీనివాస్, రాజు, ఇమామ్, దేవనందం, సుధాకర్, చంద్రయ్య, మల్లేష్, బాబు, తదితరులు పాల్గొన్నారు.





































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.