* అందినకాడికి దండుకుంటున్న సుధాకర్
* నచ్చితే దోస్తానా… నచ్చకపోతే దుష్మన్
* ప్రభుత్వ భూముల్లో పాగా వేస్తున్న నకిలీ కౌన్సిలర్
* బినామీ పేర్లతో లక్షల సంపాదన
* ప్లాట్ అమ్ముకుంటే యాభై వేలు, ఇల్లు కట్టుకుంటే లక్ష రూపాయలు
* తాజాగా ముప్పై లక్షలకు స్కెచ్
* బాదితుల పేరుతో భారీ మోసానికి స్కెచ్
* కావాలనే ఇండ్లు కూలగొట్టించిన కాసాయిగాళ్ళు
* ఖద్దరు బట్టలు, గద్దల చేతులు
* సీఎంకైనా చెప్పుకో… నన్నెవరేం చేయలేరంటున్న మాయగాడు
* చర్చి గాగిల్లాపూర్ లో వింత ఘటన
* న్యాయం కావాలంటున్న బాధితుడు మొహమ్మద్ పాషా
* సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు
కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాజకీయాల్లో కొన్ని వింతఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భార్య సర్పంచ్ అయితే… భర్త తానే సర్పంచ్ గా చేలామని కావటం, భార్య ఎంపీటీసీ అయితే భర్త ఎంపీటీసీ గా చలామని కావటం, తన భార్య కౌన్సిలర్ అయితే తాను కౌన్సిలర్ గా చేలామని కావటం, అమాయక పేద ప్రజలను భయాందోళనకు గురి చేయటం, అక్రమంగా లక్షలు దండుకోవటం, లేదంటే అక్రమ కేసులు బనాయించడం, పోలీసులను సైతం తప్పుదారి పట్టించడం… ఇలా తమ కుటుంబీకుల పదవులను అడ్డం పెట్టుకుని దాదాగిరి, దార్కరిగిరి చేయటం… అలవాటుగా మార్చుకున్నారు కొందరు కేటుగాళ్ళు. దీంతో కొన్ని సందర్భాలు మున్సిపల్ అండ్ ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాంటి వారిని హెచ్చరించినా, కొందరు మాత్రం తమ బుద్దిని మార్చుకోవటం లేదంటున్నారు ప్రజలు.

తాజాగా, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్చిగాగిల్లాపూర్ సర్వే నంబర్ 214 లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. తమ్ముడు తప్పు చేశాడని, అతడి అన్న ఆస్తులు కాజేసే పనిలో నిమగ్నమయ్యాడో నకిలీ కౌన్సిలర్. అనుకున్నదే తడవుగా… ఓ బాండు పేపర్ తెప్పించి, బాదితుల పేరుతో ముప్పై లక్షలు విలువ గల ఇంటి స్థలాన్ని రాయించి బలవంతంగా సంతకాలు పెట్టించాడీ కర్కాటకుడు. ఓ వైపు చిన్న తమ్ముడికి యాక్సిడెంట్ అయి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మరోవైపు నడిపి తమ్ముడు చేసిన పనికి వీరి మధ్యలో చిక్కుకుని ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుమంటూ కూర్చున్న ఆ అన్నను చుట్టుముట్టి రాస్తావా… చస్తావా అంటూ భయాందోళనకు గురి చేసి మానవత్వం మరిచిన నకిలీ కౌన్సిలర్ కు ఏ గడ్డి పెడితే అర్థమవుతుందో అంటూ మొఖాన ఉమ్మితే వేశారు స్థానిక ప్రజలు. అయినా కూడా బలవంతంగా సంతకాలు పెట్టించుకుని రోడ్డున పదేశాడు సదరు పెద్దమినిషి.

వివరాల్లోకి వెళితే… మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ గండిమైసమ్మ మండలం చర్చిగాగిల్లాపూర్ రాజీవ్ గాంధీ నగర్ ప్రాంతంలో గత నెల 16న మొహమ్మద్ షేక్ అనే వ్యక్తి తన మామను హత్య చేసి పరారీలో ఉన్నాడు. అతనికోసం స్థానిక పోలీసులు కొన్ని బృందాలుగా ఏర్పడి వెతుకుతున్నారు. హత్య జరిగిన అనంతరం పారిపోయిన మొహమ్మద్ షేక్ బంధువుల ఇంటిని ధ్వంసం చేశారు బాధిత కుటుంబీకులు, అనంతరం అతడి రెండో అన్న అయినటువంటి మొహమ్మద్ పాషా యొక్క ముప్పై లక్షల విలువ చేసే ఇంటిని రాసివ్వాలని స్థానికంగా ఉన్న కౌన్సిలర్ భర్త అయినటువంటి సుధాకర్, అతడి అనుచరులు బలవంతంగా బాండు పేపర్ పై సంతకాలు పెట్టించుకున్నారని మహమ్మద్ పాషా ఓ ప్రకటనలో తెలిపారు. తన తమ్ముడు హత్య చేస్తే… దానికి చట్టం, న్యాయ స్థానం ఉన్నదని, అతడికి తగిన శిక్ష వేయాలని స్థానికంగా అందరూ కోరుకుంటున్నారు, కానీ తన సోదరుడికి ఆస్తులు రాసుకోవటం, బంధువుల ఆస్తులను ధ్వంసం చేయటం తప్పు పడుతున్నారు స్థానిక ప్రజలు. ఈ విషయమై మొహమ్మద్ పాషా మాట్లాడుతూ… నా ఇంటి స్థలం నేను ఎంతో కష్టపడి కొనుక్కున్నానని, అది మా పూర్వీకుల ఆస్తి కాదని, అయినా కూడా సుధాకర్, ఆయన అనుచరులు ఒకే పనిగా తన ఆస్తిని బాధిత కుటుంబీకులకు రాసి ఇవ్వాలని బలవంతపు సంతకాలు పెట్టించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య చేసిన తన తమ్ముడిని వెతికి పట్టుకుని చట్టపరంగా శిక్షించాలని, అంతేకాని బంధువులను ఈ రకంగా ఇబ్బంది పెట్టడం సరికాదని మొహమ్మద్ పాషా అన్నారు. ఈ విషయమై తాను సైబరాబాద్ పోలీస్ కమిషనర్, పేట్ బషీరాబాద్ ఏసీపీ, దుండిగల్ సీఐ కి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తన ఆస్తిపై కన్నేసి, తనను మానసికంగా వేధిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకుని, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని మొహమ్మద్ పాషా కోరుకుంటున్నారు. తనకు న్యాయం జరగకుంటే హ్యూమన్ రైట్స్ ను సంప్రదిస్తానని ఈ సందర్బంగా మొహమ్మద్ పాషా తెలిపారు.








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.