నవతరం

తెలుగు దినపత్రిక

హెచ్ఎంటీ చైర్మన్ తో సమావేశమైన ఎమ్మెల్యే

బెంగళూరులో హెచ్ఎంటీ చైర్మన్ తో సమావేశమైన ఎమ్మెల్యే కేపి వివేకానంద్

బెంగళూరు / హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: హెచ్ఎంటి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సోమవారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ బెంగళూరులో హెచ్ఎంటీ చైర్మన్ పంకజ్ గుప్తతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ హెచ్ఎంటీ కంపెనీలో పని చేస్తున్న కార్మికులకు పెండింగ్ లో ఉన్న జీతాల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కంపెనీలో ప్రొడక్షన్ కి అవసరమయ్యే వర్కింగ్ క్యాపిటల్, కొత్త నియామకాలపై ప్రత్యేక చొరవ చూపి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అదే విధంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు 5 సంవత్సరాల నుండి పీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్, ఈఎల్ ఎన్‌క్యాష్‌మెంట్, సెటిల్‌మెంట్ అలవెన్స్‌ల వరకు న్యాయబద్ధంగా రావాల్సింది నిలిపివేయడంతో రిటైర్డ్ ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని వారికి వెంటనే న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని చైర్మన్ ను ఎమ్మెల్యే కోరారు. దీంతో చైర్మన్ సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జీఎం ఆపరేషన్స్ సుబ్రమణ్యం, యూనియన్ లీడర్లు విజయ్ కుమార్ (బెంగళూరు), సత్యనారాయణ గౌడ్, రవీందర్, శ్రీనివాస్ నాయక్ (హైదరాబాద్) పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading