నవతరం

తెలుగు దినపత్రిక

లిక్కర్ స్కాం దొంగలు కలుసుకున్నారు

* కెసిఆర్ కు బిఎస్పి భయం పట్టుకుంది
* కేజ్రీవాల్, విజయన్ ప్రజల విశ్వసనీయత కోల్పోయారు
* డా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ

మల్యాల / చొప్పదండి / జగిత్యాల, నమస్తే ఎల్లంపల్లి: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు బిఎస్పి భయం పట్టుకుందని, అందుకే నిన్న ఖమ్మం సభలో కాన్షీరాం పేరు ఎత్తారని, అంతేకాకుండా బాబాసాహెబ్ అంబేడ్కర్ గారిని కేవలం దళిత వర్గాలకు మాత్రమే పరిమితం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.70 వేల పుస్తకాలు చదివిన ఙ్ఞానం ఇదేనా అని డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా నేడు 168వ రోజు యాత్ర మల్యాల మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా పత్రికా సమావేశంలో మాట్లాడిన ఆయన నిన్న ఖమ్మంలో జరిగిన బిఆర్ఎస్ సభపై తీవర విమర్శలు చేశారు. రైతులకు రుణమాఫీ చేయకుండా, మాస్టర్ ప్లాన్ పేరుతో భూమి గుంజుకోవడం, ధనికులకు రైతుబంధు సొమ్ము ఇవ్వడం, అసైన్డ్, పోడు భూములకు పట్టాలివ్వకపోవడమే కిసాన్ సర్కారా అని ప్రశ్నించారు. 24గంటల విద్యుత్ ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్తున్న కెసిఆర్ జెన్ కో,ట్రాన్స్ కో సంస్థల్లో 40 వేల కోట్ల అప్పులు ఎలా ఉన్నాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.పేదలపై ఏసిడి పేరుతో అధిక బిల్లులు వసూలు చేసే దోపిడి పాలన ఈ దేశానికి వద్దన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఒక యూనివర్సిటీ కూడా ఎందుకు సందర్శించలేదు. విద్యావ్యవస్థపై ఒకరోజు కూడా ఎందుకు రివ్యూ చేయలేదని నిలదీశారు. దేశంలో విద్యారంగానికి అతితక్కువ బడ్జెట్ కేటాయించే ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం అన్నారు. చట్ట సభల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు ఇస్తానని చెప్తున్న కెసిఆర్ ముందుగా రాష్ట్ర కేబినెట్ లో మహిళా మంత్రులకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2014 నుండి 18 వరకు మహిళా మంత్రిని కూడా పెట్టని మహిళా వ్యతిరేకి కేసిఆర్ అని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రాజెక్టులు కడుతామని చెప్పేది వేల కోట్లు దోచుకోవడానికేనని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వలే ప్రాజెక్టుల పేరుతో దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఖమ్మంలో జరిగిన బిఆర్ఎస్ మీటింగ్ కు కేజ్రీవాల్, విజయన్ వచ్చి తమ విశ్వనీయతను కోల్పోయారన్నారు. ఢిల్లీ, కేరళలో కూడా పేదల భూములు లాక్కొని,పేదల ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వేస్తారా అని ఎద్దేవా చేశారు. కొండగట్టు, వేములవాడ వంటి దేవాలయాలపై,గ్రామ దేవతలపై కెసిఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని పేర్కొన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని ప్రజలకు తెలంగాణలో లేరా? వారికి ఎందుకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. నియోజకవర్గంలో వరిపంట ఎక్కువగా పండుతుంది కానీ, తగినన్ని గిడ్డంగులు లేవని, పాల ఉత్పత్తి ఉన్నా, శీతలికరణ కేంద్రాలు లేవన్నారు. కొండగట్టు బస్సు ప్రమాద బాధితులను కనీసం పరామర్శించలేదని మండిపడ్డారు. ఈ రోజు యాత్ర నూకపల్లి, తాటిపల్లి, బల్వంతపూర్ గ్రామాల్లో పర్యటించారు.ఇంకా మానాల, మల్యాల గ్రామాల్లో పర్యటించనున్నారు. యాత్రలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, నియోజకవర్గ ఇంచార్జి మంద రవీందర్, కొంకటి శేఖర్, నియోజకవర్గ అధ్యక్షులు మహంకాలి తిరుపతి, మహిళా రాష్ట్ర కన్వీనర్ శిరీష, జన్ను స్వరూప, అనూష, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading