* కేంద్రంలో ఫాసిస్ట్ పాలన కొనసాగుతుంది
* కిసాన్ సర్కార్ పేరుతో మరో కుట్రకు పన్నాగం
* డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ
గంగాధర / కరీంనగర్, నమస్తే ఎల్లంపల్లి: కేంద్రంలో బిజెపి నాయకత్వంలో ఫాసిస్టు పాలన కొనసాగుతుందిని ప్రతి ప్రభుత్వ సంస్థను తమ ఆధీనంలో పనిచేసేలా ఒత్తిడి, బలవంతం చేస్తున్నారని డా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల నియామకంలో బిజెపి ప్రభుత్వం కావాలని రాద్ధాంతం చేస్తుందని ఆయన ఆరోపించారు. పత్రికా స్వేచ్ఛను కాలరాస్తుందన్నారు. నిజాలు రాయకుండా పత్రికలను సెన్సార్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతుందని మండిపడ్డారు. పత్రికలు ఏ వార్త రాసినా ఆధారాలు చూపాలనడం అన్యాయమన్నారు. తెలంగాణలో కూడా ఇలాగే నిజాలు రాస్తున్న పత్రికలను కెసిఆర్ కొంటున్నారని లేదా అరెస్టు చేసి జైలుకు పంపి అణిచివేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించే గొంతు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫాసిస్ట్ పాలన కొనసాగిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 300ల రోజుల బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా నేడు 170వ రోజు చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కిసాన్ సర్కార్ పేరుతో మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. లిక్కర్ స్కాం పేరుతో కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిన ఆప్, బిఆర్ఎస్ దోస్తీ చేస్తున్నాయని, ఢిల్లీ తెలంగాణలో దోచుకున్నది చాలక దేశాన్ని దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అవినీతి, దోపిడి పాలనకు ప్రతీక అయిన బిఆర్ఎస్ పార్టీ సభకు హాజరు కావడం వల్ల పినరయి విజయన్, కేజ్రీవాల్ తమ విశ్వసనీయతను కోల్పోయారన్నారు.. పేదల భూములకు పట్టాలివ్వకుండా మాస్టర్ ప్లాన్ పేరుతో భూములు గుంజుకుంటూ, భూములు కోల్పోయిన వారికి పరిహారం ఇవ్వకుండా అన్యాయం చేయడమే కిసాన్ సర్కారా అని నిలదీశారు. ప్రజలు ఇపుడు దోపిడి పార్టీలకు స్వస్తి పలికి, సంపదను సమానంగా పంచే బిఎస్పి వైపు చూస్తున్నారని పేర్కోన్నారు. నియోజకవర్గంలో గ్రానైట్ క్వారీల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రోడ్లు పాడైపోతున్నాయని, దుమ్ము విపరీతంగా రావడం వల్ల అనారోగ్యబారిన పడుతున్నారని పేర్కొన్నారు. గ్రానైట్ కంపెనీలో పనిచేసే కార్మికుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వివిధ కాలువలు, రిజర్వాయర్ల పేరుతో భూములు గుంజుకొని పరిహారం ఇవ్వడంలేదని, అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వకపోవడాన్ని ఆయన ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇళ్లు కట్టివ్వడంలో విఫలమైందన్నారు. దొంగ హామీలు, దొంగ సమాచారం పంపి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. పాఠశాలలకు కనీస వసతులు ఇవ్వడం లేదన్నారు. టీచర్లను కూడా నియమించడం లేదని 317 జివో తెచ్చి ఉన్న టీచర్లను కూడా పంపి పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నారని ఆరోపించారు. బిఎస్పి పార్టీకి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణను చూసి బిఆర్ఎస్ భయపడుతుందన్నారు. అందుకే బిఎస్పి జెండా గద్దెలను అర్థరాత్రి కూల్చుతున్నారని మండిపడ్డారు. అదేవిధంగా ఖమ్మం సభలో కాన్శీరాం అంబేడ్కర్ పేరు చెప్పారని గుర్తుచేశారు. ఇలాగే కొనసాగితే బిఆర్ఎస్ పాలకుల గడీలను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. యాత్ర ఒద్యారం, ఆచంపల్లి, గుర్షకుర్తి, ఉప్పరమల్యాల, కురిక్యాల గ్రామాల్లో కొనసాగింది. ఇంకా గంగాధర, లక్ష్మిదేవిపల్లి, నర్సింహులపల్లి, బూరుగుపేట గ్రామాల్లో కొనసాగనుంది. యాత్రలో రాష్ట్ర నాయకులు జక్కని సంజయ్, మహిళా కన్వీనర్ శిరీష, జోనల్ మహిళా కన్వీనర్ స్వరూప, జిల్లా ఇంచార్జి నల్లాల రాజేందర్, చిర్ర శంకర్, జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్, నియోజకవర్గ ఇంచార్జి మంద రవీందర్, నియోజకవర్గ అధ్యక్షులు తిరుపతి మహిళా కన్వీనర్ స్వప్న, అనూష తదితరులు పాల్గొన్నారు.






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.