ములకలపల్లి, నమస్తే ఎల్లంపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం రాచన్నగూడెం పంచాయతీ పరిధిలో రాసిన పేట గ్రామంలో అన్నదమ్ముల్లా కలిసుండే ఆదివాసీల ను రెచ్చగొట్టి కులం తప్పుల పేరుతో వేధింపులకు దిగుతున్నారు. కులం తప్పుకూడా లక్షల్లో వేస్తున్నారు. దీనితో గొడవలు జరుగుతున్నాయి. కులం వేసిన తప్పు కట్టలేము అని ఆ కుటుంబం అంటే వారిపై విచక్షణ రహితంగా దాడులకు దిగుతున్నారు. దాడులతో బాధితులను విడవకుండా వారిని సాంఘీక బహిష్కరణ చేసి వెలివేస్తున్నారు. ఇలాంటి ఘటన ములకలపల్లి మండలంలో ఒకటి వెలుగులోకి వచ్చింది. పోలీస్టేషన్ కు పోతే కాలయాపన చేస్తున్నట్లు బాధిత కుటుంబం ఆరోపించడం విస్మయాన్ని కలిగిస్తుంది. బాదుతులకు న్యాయం ఎక్కడ , ఎవరు చేస్తారో అర్ధం కాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి అమానవీయ ఘటనలకు, అవమానాలకు రాజకీయాలే కారణంగా బాదుతులు చెపుతున్నారు. ఇలాంటి అమానవీయ ఘటనల పట్ల తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని సంబంధిత కుటుంబానికి అండగా నిలవాలని, బాద్యులైన వారిపై చట్టప్రకారం చర్యతీసుకోవలని సాంఘీక బహిష్కరణకు గురైన కుటుంబం ప్రాధేయపడుతుంది.






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.