నవతరం

తెలుగు దినపత్రిక

బీసీ రిజర్వేషన్ పెంపు కొరకు కోటి సంతకాల సేకరణ

నకిరేకల్, నమస్తే ఎల్లంపల్లి: దేశంలో అత్యధిక జనాభా కలిగిన బీసీ కులాలకు 52% రిజర్వేషన్ వాటాను రాజ్యాంగ బద్దంగా ఈ పాలక ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వలేక పోతున్నాయని బిస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి ప్రశ్నించారు. బీఎస్పీ పార్టీ తరపున బీసీ రిజర్వేషన్ కొరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ వెంటనే జనగణన జరిపి రిజర్వేషన్లు పెంచాలని అన్నారు. గతంలో మండల్ కమిషన్ 52 శాతం ఉన్న బీసీ లకు, కుల గనన చేయాలనీ నివేదిక అమలు చేయాలనీ మాన్యశ్రీ కాన్షీరాం ఒత్తిడితో నాటి ప్రధాని విపి సింగ్ పార్లమెంట్ లో బిల్లు పెడితే, ఇదే కాంగ్రెస్, బీజేపీ, ఇతర జాతీయ పార్టీలు వ్యతిరేకించినాయి. దేశం మొత్తం అల్లకల్లోలం చేసి, బీజేపీ మండల్ కమీషన్ వద్దని, బీసీలను తప్పుదోవ పట్టించడానికి, అయోధ్య రామ మందిరం అని రథయాత్ర తీసారు. ఈదేశంలో కుక్కలకు, పశు, పక్షాధులకు, పందులకు లెక్కలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కానీ బీసీ కులాలకు లెక్కలు లేవు, 76ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఇంత వరకు ఏ ప్రభుత్వాలు బీసీల కుల గనన ఎందుకు చేయడం లేదు? ఒక్క బిఎస్పీ తప్ప ఏపార్టీ కూడా ఎందుకు అడగడం లేదు? ఈ అన్యాయాన్ని గమనించిన రాష్ట్ర అద్యక్షులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీసీ రిజర్వేషన్ పెంపు కోసం కోటి సంతకాలు చేసి రాష్ట్రపతికి, గవర్నర్, కేంద్ర ప్రభుత్వాలకు పంపడం జరుగుతుందన్నారు. కనుక మనువాద పార్టీ లలో ఉన్న బీసీ లు చైతన్యము కావలసిన అవసరం ఉందని తెలియ జేశారు. సంతకాల సేకరణలో పెద్ద ఎత్తున పాల్గొనాలని, పిలుపునిస్తూ బీసీలతో ఉదయం 10-00 నుండి సాయంత్రం 5-00 వరకు సంతకాలు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కొవ్వూరి రంజిత్, నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ మహిళా కన్వీనర్ మర్రి శోభ,నకిరేకల్ మండల అధ్యక్షులు చేట్టిపల్లి శంకర్,నాయకులు తడాకా విజయ్,గుని శివ, వంశీ, జాశ్వా తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading