హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
నిజామాబాద్ జిల్లా, నమస్తే ఎల్లంపల్లి: ఆర్మూర్ లో జరుగుతున్న నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశంకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈటల రాజేందర్. ఈ సందర్బంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… నందిపేట గ్రామ సర్పంచ్ వాణి తిరుపతి బిల్లులు రావడం లేదని కలెక్టర్ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకుంది, అదృష్టవశాత్తూ బ్రతికించి. మరోపక్క ప్రగతి భవన్ ముందు తన భూమిని గుంజుకున్నారని ఇబ్రహిపట్నంకు చెందిన ఐలేష్ ఆత్మహత్యయత్నం చేశారు. ప్రజల సమస్యలు పట్టించుకొనే నాథుడు ఎవడు లేడు అనడానికి ఉదాహరణ ఇవన్నారు. పాత ఇందురు జిల్లాలో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రాములు అనే రైతు చనిపోయారు. గజ్వేల్ కు చెందిన ఎరుకల బిడ్డ రమేష్ డబుల్ బెడ్ రూం రాలేదని… విషం తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ చనిపోయారు. సంగారెడ్డి జిల్లాలో తరతరాలుగా ఉన్న అసైన్డ్ భూమి పోయింది అని 19 ఏళ్ళ యువకుడు చనిపోయారు. కెసిఆర్ అంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎప్పుడు చూడలేదు. ప్రభుత్వం అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా అని కెసిఆర్ మర్చిపోయారు. ధరణీ వల్ల రైతులు వేదన అనుభవిస్తున్నారు. కెసిఆర్ ఉంటే ప్రగతి భవన్ లో లేదంటే ఫామ్ హౌస్ లో ఉంటారు. రాచరికంలో రాజులు కూడా ప్రజలు ఏమనుకుంటున్నారని మారు వేషంలో వెళ్ళి తెలుసుకునేవారు. కానీ కెసిఆర్ ఆ ప్రయత్నం చెయ్యడం లేదు. కెసిఆర్ ఒడిపోవాలని.. బీజేపీ అధికారంలోకి రావాలి అని ప్రజలందరూ కోరుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు దెబ్బకొడితే కెసిఆర్ దిమ్మతిరిగింది. 2018 లో అధికారం ఇస్తే కళ్ళు నెత్తికిఎక్కి నాలుగునెలలు మంత్రివర్గం ఏర్పాటు చెయ్యలేదు. కెసిఆర్ నీచమైన సాంప్రదాయాలు తెచ్చారు. ఓటుకు వెలగట్టాడు. ఇదే పద్ధతిని దేశమంతా అమలు చేయాలని BRS పెట్టారా అన్నారు. మార్పుకు సంకేతాలు నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు. తెలంగాణ ఉద్యమంలో తొలికూత కుశాయి. కెసిఆర్ గొప్పగా అయ్యే పని చేయడు..
ప్రతిపక్ష పార్టీలలో అల్లకల్లోలం సృష్టించి.. ఆయనే దిక్కు అనేలా చేస్తారు. కేంద్రం అందించే ఎరువుల సబ్సిడీ ఎకరానికి 10 వేల రూపాయలు. పత్తికి ఎకరానికి 15 వేల రూపాయలు ఇస్తుంది. ఎకరానికి 6 వేల రూపాయలు కేంద్రం ఇస్తుంది. కానీ కెసిఆర్ మాత్రం ఫామ్ హౌస్ లకి డబ్బులు ఇస్తున్నారు. పేదల డబ్బులు భూస్వాములకు అప్పచెప్తున్నారు. మూడున్నర లక్షల కోట్లు కేంద్రానికి ఇస్తే.. తిరిగి రాష్ట్రానికి లక్షన్నర కోట్ల రూపాయలు ఇస్తుందని కేటీఆర్ అంటున్నారు.
కేటీఆర్ చదువుకున్నారా? లేదా? తెలంగాణ భారత దేశంలో ఉందా? లేదా? అనే అనుమానం వస్తుంది. GHMC 70% ఆదాయం వస్తుంది. అదిలాబాద్ లో ఆదాయం రాదు అని అక్కడ ఖర్చుపెట్టరా? ఆ సంస్కారం లేదా? హైదరాబాద్ డబ్బు లేకుండా రాష్త్రం నడుస్తుందా? జ్ఞానం ఉండాలి. మోదీ ఎప్పుడు నేను ఇస్తున్న అని అనలేదు. కెసిఆర్ మాత్రం నేను ఇస్తున్న పెన్షన్ ఇస్తున్నా, నేను కల్యాణలక్ష్మి అని చెప్పుకుంటున్నారు. కేంద్రం రాష్ట్రం రెండింటికీ డబ్బులు ఇచ్చేది ప్రజలు. లిక్కర్ పైసలు, ఇన్కమే టాక్స్ పైసలు రాష్ట్రానికి మాత్రమే వస్తాయి. తెలంగాణ వచ్చినప్పుడు తాగుడు మీద వచ్చే ఆదాయం 10 వేల కోట్లు ఐతే ఇప్పుడు 45 వేల కోట్లు అయ్యింది. ఇది.. ప్రజా ప్రభుత్వమా ? ప్రజా కంటక ప్రభుత్వమా ? ప్రజలే తేల్చాలన్నారు. ఇంకా చాలా మంది నాయకులు బిజెపిలోకి రావల్సిఉంటుంది. ఎన్నికల జోన్ లోకి రాగానే కుప్పలు తెప్పలుగా వచ్చేస్తారు. మొదట వచ్చేది సర్పంచులు. స్థానిక సంస్థలను కెసిఆర్ సర్వనాశనం చేశారు. కరెంటు బిల్లులు అడ్డగోలుగా పెంచారు. కెసిఆర్ బయటపడకుండా.. దొంగతనంగా చార్జీలు వేస్తారు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ కరెంటు బిల్లులు. మనం ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల మీద పోరాడుదాం.. వారి ఆశీర్వాదం మనకు ఉంటుందన్నారు.






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.