నవతరం

తెలుగు దినపత్రిక

22న హైదరాబాద్‌కు చెగువేరా తనయ

*ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు
*భాజపా, మజ్లిసేతర పార్టీలతో సంఘీభావ సంఘం ఏర్పాటు

హైదరాబాద్‌ / హిమాయత్‌నగర్‌, నమస్తే ఎల్లంపల్లి: క్యూబా విప్లవ యోధుడు చెగువేరా తనయ డాక్టర్‌ అలైద గువేరా, ఆమె కుమార్తె ప్రొఫెసర్‌ ఎస్టిఫోనియా గువేరా ఈ నెల 22న హైదరాబాద్‌కు రానున్నారు. కొద్దిరోజుల కిందట దిల్లీకి చేరుకున్న అలైదా గువేరా, అక్కడి నుంచి వైద్యసేవల నిమిత్తం కేరళకు వెళ్లారు. 22న హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఆరోజు సాయంత్రం 4 గంటలకు రవీంద్రభారతిలో చెగువేరా తనయ, మనవరాలికి ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాధారాణి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి మాధవరావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ప్రొ.శాంతాసిన్హా, ప్రొ.హరగోపాల్‌, ప్రొ.కె.నాగేశ్వర్‌ సహా భారాస, కాంగ్రెస్‌, తెదేపా, వామపక్షాల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఉపన్యాసకులుగా హాజరవుతారు. వారికి ఘనంగా స్వాగతం పలకాలని భాజపా, మజ్లిసేతర పార్టీల ప్రతినిధులతో కూడిన సంఘీభావ కమిటీ నిర్ణయించింది. గురువారం హిమాయత్‌నగర్‌లోని మఖ్దూంభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు మల్లు రవి, సంఘీభావ కమిటీ సమన్వయకర్తలు డీజీ నర్సింహారావు, బాలమల్లేశ్‌, శ్రీపతి సతీష్‌ (తెదేపా), గోవర్ధన్‌ (సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ), దిడ్డి సుధాకర్‌(ఆప్‌), ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక కరపత్రాన్ని ఆవిష్కరించారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading