యువత రాహుల్ నాయకత్వం వైపు అడుగులు
దేశాన్ని ఏమార్చే పనిలో కెసిఆర్, మోడీలు
మేడిపల్లి, నమస్తే ఎల్లంపల్లి: తెలంగాణ రాష్ట్రంలో 2018 ఎన్నికలలో తెరాస పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీల అమలను అర్ధాంతరంగా ఆపివేసి అప్పటికప్పుడు రాజకీయ అవసరాల కోసం నూతన స్కీమ్ లు తెచ్చి పాతవాటిని మరిపించెందుకు కొత్తవి అమలు చేస్తున్నాం అనే అర్బాటలలో కెసిఆర్ ప్రభుత్వం. అందులో భాగంగానే రాష్ట్రాన్ని గాలికోదిలేసి దేశంలో తెలంగాణ మోడల్ అని ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడ మోడీకి కెసిఆర్ కి రెండు అంశాల్లో ఒకే విధమైన లక్షణాలు ఉన్నాయి. అవసరానికి సెంటిమెంట్ రగిలించడం, అమలుకు సాధ్యం కానీ హామీలను ఇచ్చిఅవసరం తీరినతర్వత ఇచ్చిన హామీలను మరిచిపోవడం. ఇద్దరు ఇద్దరే నాటి హిట్లర్ ను పోలిన నేతలు వారి అవసరానికి అనుకూలంగా బిగ్ లై, తీయరి వాడటం ఇది అబద్దం అనడానికి నమ్మశక్యం కాని పెద్ద అబద్దం ఆడటం. ఆ అబద్దంతో కాలం వెల్లతియడంలో నేర్పరులు ఇద్దరు.
మోడీ గుజరాత్ మోడల్ అని ప్రచారం మొదలు పెట్టి
1) మోడీకి పెళ్లి కాలేదని ప్రచారం చేసుకొని ప్రధాని అయిన తర్వాత పెళ్లి చేసుకుని దేశంకోసం భార్యను వదిలేశాడు అని మళ్ళీ నూతన ప్రచారం చేసుకోవడం.
2) స్విస్ బ్యాంకుల్లో ఉన్న భారతదేశ నల్లదనాన్ని తీసి దేశంలోని ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తానని ప్రచారం చేసుకొని అధికారంలోకి వచ్చాక వాటిని మరిపించే మాటలు చెప్పడం.
కెసిఆర్…
1) ప్రజలను నమ్మించడానికి నేను నా భార్య ముసలోల్లం నా పిల్లలు ఇద్దరు అమెరికాలో ఉన్నారు అని ప్రత్యేక రాష్ట్రం కోసం నేను ప్రాణత్యాగం చేస్తానని చెప్పి తెరాసకు రాజకీయ పలుకుబడి పెరిగే క్రమంలో అతని ఇద్దరు పిల్లలను తెచ్చి రాజకీయాల్లో పెట్టారు.
2) దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చారు.
3) ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఇలా ఒక్కటి రెండు అని కాదు మోడీ, కెసిఆర్ లు ఇద్దరు మాత్రమే ప్రపంచ రాజకీయాల్లో అతిపెద్ద లై తియరిని ప్రజలపై అప్లై చేస్తూ రాజకీయ లబ్దిపొందుతున్న వారిలో ఒకటి, రెండు స్థానాలలో ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఇచ్చిన హామీ ఏమైంది అని మోడీ అడుగరు, దేశంలో ప్రతిఒక్కరి అకౌంట్ లో 15 లక్షలు ఏమైనవి అని కెసిఆర్ అడుగడు. ఇక్కడ మోడీ కెసిఆర్ లు కలిసి ఉన్నారు అనడానికి ఒక్క చిన్న ఉదాహరణ కెసిఆర్ తప్పులు మోడీ చెప్పడు, మోడీ తప్పులను కెసిఆర్ చెప్పరు కానీ వీరిద్దరూ కలిసి విడివిడిగా కాంగ్రెస్ పార్టీనీ లేకుండా చేయడానికి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ చేసిన పనుల్లో తప్పులను వేతకడమే పనిగా పెట్టుకున్నారు. మోడీ దేశాన్ని అప్పుల కుప్పగా చేస్తే తానేం తక్కువ కాదని కెసిఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు. రాహుల్ గాంధీ చేస్తున్న జోడో యాత్రకు దడుసుకున్న బీజేపీ కెసిఆర్ ను బిఆర్ఎస్ గా అప్ గ్రేడ్ చేసి కాంగ్రెస్ నుండి ప్రజలను దూరం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసేందుకు దేశంపైకి వదిలాడు. వాస్తవానికి రాహుల్ గాంధీ జోడో దేశంలోని సబ్బండ వర్గాల ప్రజలు జోడీ కట్టివస్తున్నారనేది బీజేపి ఎరిగిన సత్యం ఆ సత్యాన్ని జీర్ణించుకోలేని బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచనలో పడింది. రాహుల్ గాంధీ మీద ట్రోల్ చేయడానికి వాట్సప్ యూనివర్సిటీకి కూడా సబ్జెక్ట్ దొరకని పరిస్థితిలో ఉంది బీజేపీ. నాడు కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ అనే మాట నుండి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధె దేశానికి కాంగ్రెస్ పార్టీనే అనే స్థాయికి వెళ్ళింది ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పరిస్థితి. రాహుల్ గాంధీ జోడోలో ప్రవర్తిస్తున్న తీరును యావత్ ప్రపంచం చూస్తుంది. నాడు రాజీవ్ గాంధీ రాజకీయాలకు ఎదురుగా నిలిచిన కాంన్షిరాంను నేడు మోడీకి ఎదురుతిరిగిన రాహుల్ లో చూస్తున్నారు అనడానికి సందేహించల్సిన అవసరం లేదు. ఇవ్వన్నీ గమనిస్తున్న బీజేపీ, కెసిఆర్ కాంగ్రెస్ పార్టీతో వేరు వేరుగా కలబడడం చేతకానీ పరిస్థితుల్లో తెలంగాణలో పుంచుకుంటున్న కాంగ్రెస్ పార్టీని, క్యాడర్ ను అయోమయంలోకి నెట్టడానికి విడిపోయి కనిపిస్తూ కలిసి కష్టపడి కొట్లాటని రక్తి కట్టిస్తున్న బీజేపీ, బారాస, వారి రాగాలకు తాళాలు వేస్తున్న కొంతమంది కాంగ్రెస్ నేతలు. తెలంగాణలో బిఆర్ఎస్,బీజేపీ వేరు అని చెప్పుకొని వారు కలబడినట్లు కనిపిస్తూనే కాంగ్రెస్ పార్టీనీ ఓడగొట్టడానికి కలిసి పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీవారు ఇచ్చిన రాష్ట్రంలో వారే అధికారాన్ని కోల్పోవడం అంటే కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం కొట్టొచ్చినట్లు స్పష్టంగ కనిపిస్తుంది.అయిన దానిని ఎవరు పట్టించుకోరు. పనిచేసేవారికి సపోర్టు ఇవ్వరు. 2000 సంవత్సరంలో ఎన్ డి ఏ ప్రభుత్వం బీహార్ రాష్ట్రం నుండి ఆగస్టు 2 రాష్ట్ర పున్వ్యవస్థీకరణ బిల్లు పెట్టీ నవంబర్ 15 జార్కండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ రాష్ట్రాన్ని ఇచ్చిన ఒక్క సందర్భంలోనే రబ్రిదేవి ముఖ్యమంత్రిగా ఉంది. మిగిలిన కాలంలో జనతాదళ్ 2022లో బీజేపీ చేతిలో మోసాన్ని గుర్తించిన జనతదల్ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీహార్ నుండి జార్కండ్ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ 22 సంవత్సరాల కాలంలో బీజేపీ జెఎంఎం మిత్రపక్షాలను కలుపుకొని 11 సంవత్సరాలు అధికారంలో ఉంది. జార్కండ్ రాష్ట్రంలో ప్రస్తుతం జెఎంఎం అధికారంలో ఉన్నది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2003 నుండి 2013 వరకు బీజేపీ అధికారంలో ఉన్నది. ఒక్క 2020 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2000 సంవత్సరంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి కొత్తగా ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ వరుసగా 15 సంవత్సారాలు అధికారంలో ఉన్నది. ఈ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ మెజార్టీ సంవత్సరాలు అధికారంలో ఉన్నది.ఛత్తీస్గడ్ రాష్ట్రంలో ఏకంగా 15 సంవత్సరాలు అధికారంలో ఉన్నది. ఈ లెక్కన తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి అదేస్థాయిలో అవకాశాలు ఉన్న కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపంతో అసలు ప్రతిపక్ష పార్టీ హోదాను కూడా నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నది. రాహుల్ గాంధీ చేస్తున్న జోడోయత్ర దేశంలో సోషల్ మీడియాలో బందిలైన యువకులకు సైతం ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో రాజకీయాలు ఎంత అవసరమో అర్థం అయ్యేలా చెప్పింది.తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డికి తోడు కాంగ్రెస్ సీనియర్ నాయకుల నీడ నడిస్తే కెసిఆర్-మోఢీ..లు కూడా కాంగ్రెస్ పార్టీనీ అధికారంలోకి రాకుండా అడ్డుకోలేవు. ఈ వాస్తవం రాష్ట్ర ప్రజలకు అర్థం అయ్యింది, అర్థం కావల్సింది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే.






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.