* యువతకు స్వామి వివేకానంద మార్గదర్శకుడు
* సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్
ములుగు, నమస్తే ఎల్లంపల్లి: సమసమాజ నిర్మాణం, దేశ దారిద్ర్య రేఖ నిర్మూలన కోసం పోరాడి, దేశాభివృద్ధి యువశక్తి పైనే ఆధారపడి ఉందని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద యువతకు మార్గదర్శకుడని ములుగు, భుపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు. గురువారం జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద 160వ జయంతిని ములుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి తస్లీమా పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తస్లీమా మాట్లాడుతూ యువకులు సమాజంలో ఎదురయ్యే సవాళ్ళను ధైర్యంగా ఎదురొడ్డి నిలవాలని, యువ తరంగానికి మార్గ నిర్దేశం చేసిన స్వామి వివేకానంద యువతకు ఆదర్శంగా నిలిచారని ఆమె అన్నారు. స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి, ఆయన మాటలు తూటాల కంటే వేగంగా ప్రయాణిస్థాయి, అంతకు మించి మన ఆలోచనలను మార్చివేసి, మనలో ధైర్యాన్ని నింపుతాయని తస్లీమా అన్నారు. ఈ కార్యక్రమంలో ఆఫీసు సిబ్బంది, యువకులు,రిజిస్ట్రేషన్ దారులు ఉన్నారు.





































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.