* ఆదివాసీలను మోసం చేసున్న ప్రభుత్వాలు, కాంట్రాక్టర్లు
తెలంగాణ, నమస్తే ఎల్లంపల్లి: తునికాకుకు సంబంధించి ప్రభుత్వాలు కాంట్రాక్టర్లు ఆదివాసీలను మోసం చేసున్నారని భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు జిల్లాల డివిజన్ కార్యదర్శి ఆజాద్ ఓప్రకటనలో విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాకు విడుదల చేసిన లేఖలో వివరాలిలా ఉన్నాయి. తునికాకు సేకరణకు ప్రభుత్వాలు, కాంట్రాక్టర్లు అన్ని ప్రాంతాలలో టెండర్లు పిలవకుండా కొన్ని ప్రాంతాలలోని టెండర్లు పిలిచి, ఆదివాసి ప్రాంతాల పట్ల వివక్ష చూపుతున్నారన్నారు. దీని మూలంగా వేసవిలో వచ్చే కొద్దిపాటి ఆదాయానికి ప్రభుత్వాలు గండి కొడుతున్నాయని, అలాగే తునికాకు కట్టకు మూడున్నర రూపాయలు చెల్లించాలన్నారు.
ప్రజలతో సంబంధం లేకుండా పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను పరిగణలోకి తీసుకోకుండా ఆకు రేటు నిర్ణయించడం ద్వారా తునికాకు కూలీలు కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకుండా నష్టపోవాల్సి వస్తుందన్నారు. కొన్ని ప్రాంతాలలో మొడెం కొట్టే పనులకు మధ్య వ్యక్తుల ద్వారా పనిచేయిస్తూ కూలీలకు తగ్గ ప్రతిఫలం ఇవ్వడం లేదని ఆరోపించారు. వెంటనే అన్ని ప్రాంతాల్లో మొడెం కొట్టే పనులు ప్రారంభించాలనిఆ పనులకుగాను కూలీలకు రూ. 700లు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే 50 ఆకుల కట్టకు మూడున్నర రూపాయలు చెల్లించాలని, కూలీలకు ఇవ్వాల్సిన బోనస్ డబ్బులను వెంటనే విడుదల చేయాలని, తునికాకు సేకరణలో గాయపడిన వారికి ఆసుపత్రి ఖర్చులు చెల్లించాలని, మెయింటెనెన్స్కు గాను రూ. రెండు లక్షలు, ప్రమాదంలో చనిపోయిన వారికి రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.













































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.