నవతరం

తెలుగు దినపత్రిక

ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం ఏమైంది?

నల్గొండ, నమస్తే ఎల్లంపల్లి: చేరుక్కపల్లి గ్రామం డిండి మండలం నల్గొండ జిల్లాలో ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తి చేస్తానని మొట్టమొదటి అసెంబ్లీలో మాటిచ్చాడు కేసీఅర్. ఎనిమిది సంవత్సరాలు అవుతున్న ఎక్కడ వేసిన గొంగళి అక్కడే తప్ప, మాటలకే పరిమితమయ్యాడు అన్నారు. కెసిఆర్ మాటలకు.. చేసే చేతలకు ఎంత వ్యత్యాసం ఉందో SLBC స్వరంగ మార్గం, డిండి లిఫ్ట్ లే సజీవ సాక్ష్యం. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ ప్రాంతమని పాటలు రాశనన్న ముఖ్యమంత్రి.. తాగే నీరు వల్లే కాదు, ఫ్లోరైడ్ నీళ్లతో పండించే పంట వల్ల కూడా ఫ్లోరైడ్ వస్తదన్న ముఖ్యమంత్రి, సర్ఫేస్ వాటర్ పారిస్తాని నల్లగొండ జిల్లా ప్రజలకు మొండి చేయి చూపించాడు. ఒకనాడు మహబూబ్ నగర్ జిల్లాకు ఎంపీగా ఉన్నారు కేసీఆర్. ఆనాటి ప్రాజెక్ట్ లే తప్ప కొత్తగా మొదలుపెట్టిన ప్రాజెక్టులు పూర్తయి.. ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదు. వరుణుడు కరుణించి, ప్రకృతి కనికరించి, మంచి వర్షాలు పడటం వల్ల.. బోర్లలో, బావిలలో, నీళ్లు రావడం.. చెరువుల, కుంటలు, నిండటం.. వల్ల వ్యవసాయం జరుగుతుంది తప్ప.. కెసిఆర్ మొదలుపెట్టి పూర్త చేయనటువంటి ప్రాజెక్టుల వల్ల ఒక్క ఎకరనికి కూడా నీళ్లు రాలేదు. వీటి గురించి మాట్లాడితే ఎదురు దాడి తప్ప ఇంకొకటి లేదు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రాణప్రదాయమైన ప్రాజెక్టు కాలేశ్వరం ప్రాజెక్టుని నేనే డిజైన్ చేసిన, నేనే ఇంజనీర్ కంటే ఎక్కువ కష్టపడ్డా, నా మెదడును రంగరించి పనిచేసిన అని చెప్పిన ముఖ్యమంత్రి… సుందిల్ల, అన్నారం, మెడిగడ్డ వద్ద ఉన్న లిఫ్ట్ లు కాంక్రీట్ కూలిపోయి, మోటర్లన్నీ మునిగితే సంబంధిత మంత్రి ఇవాల్టికి కూడా రిపేర్ చేయించలేదు. అవగాహన రాహిత్యానికి నిట్ట నిలువు నిదర్శనం కన్నేపల్లి పంప్ హౌస్ లు. ఒకనాడు తెలంగాణ వ్యాప్తంగా బస్సులు పెట్టి వచ్చి కాలేశ్వరం చూడండి అని జబ్బులు చరుచుకున్న ముఖ్యమంత్రి. ఇవాళ ఒక మనిషిని కూడా అక్కడకి పోనివ్వడం లేదన్నారు. ఇరిగేషన్ రంగంలో ప్రపంచంలోనే అద్భుతాలు సృష్టిస్తా అన్న ముఖ్యమంత్రి.. పాత ప్రాజెక్టులు పూర్తికాక.. పూర్తయిన ప్రాజెక్టులు మునిగిపోవడం..ఇలా తెలంగాణ ప్రజలను వంచిస్తున్న, మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రతిపక్ష పార్టీలను కొనే చిల్లర వ్యవహారాలు, లొంగకపోతే భయభ్రాంతులకు గురి చేసి.. మాలాంటి వాళ్ల మీద పోలీసు వాళ్ళని ఉసిగొలిపి కేసులు పెట్టించి, భయభ్రాంతులకు గురిచేసి, రకరకాల పద్ధతుల్లో ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత నష్టం చేసిన, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన.. కేసీఆర్ ను గద్దె దించేంతవరకు బిజెపి కేంద్ర, రాష్ట్రస్థాయి నాయకులు, కార్యకర్తలు కలిసి ముందుకు వెళ్తాం. దేశం మొత్తంలో ధరలు పెరుగుదల ఎక్కువ ఉండి సామాన్యుడు బ్రతకలేని స్థితికి నెట్టి వేయబడ్డ రాష్ట్రం తెలంగాణ అని సర్వేలు చెబుతున్నాయన్నారు ఈటల రాజేందర్. మద్యాన్ని ఎక్కువ తాగించి యువకుల చావులకు కారణమవుతున్న రాష్ట్రం తెలంగాణ. ఈ దేశంలో .. పరిపాలనలో.. అన్ని రాష్ట్రాల కంటే కూడా ఆదమపాతాలంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలో అతి తక్కువ సమయంలో, అతి ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రం కూడా తెలంగాణ నే అన్నారు.

బీఆర్ఎస్ ఒక డ్రామా కంపెనీ
నల్లగొండ జిల్లాలో బిజెపి ఎక్కడదని అన్నారు.. కానీ మునుగోడు లో 90 మంది ఎమ్మెల్యేలు, వందల కోట్ల రూపాయల నల్లధనం, పోలీసుల పహారాలో గ్రామ గ్రామానికి దిగ్బంధం చేసినప్పటికీ కూడా 87 వేల ఓట్లు ఇచ్చి బిజెపికి పట్టం కట్టినటువంటి జిల్లా నల్లగొండ జిల్లా.. టెక్నికల్ గా ఓడిపోయి ఉండొచ్చు కానీ నైతికంగా మునుగోడులో బిజెపిదే విజయం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టేది, బొంద పెట్టేది బిజెపి మాత్రమే. కెసిఆర్ దుర్మార్గాల, బ్రోకర్ మాటల మీద బిజెపి తప్పకుండా యుద్ధం చేస్తది. మహిళలు వడ్డీ లేని రుణాల కోసం, నిరుద్యోగులు నిరుద్యోగ భృతి కోసం, రైతుల ధరణి, రుణమాఫీ కోసం, గిరిజనులు పోడు భూములు సమస్యలపై ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు ఈటల రాజేందర్.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading