నవతరం

తెలుగు దినపత్రిక

తంగిరాల జేమ్స్ నోబుల్ కు కాంస్యపథకం

జాతీయస్థాయి బృంద సంగీత పోటీలలో హైదరాబాద్ ఉప్పల్ విద్యార్థి తంగిరాల జేమ్స్ నోబుల్ కు కాంస్యపథకం

హైదరాబాద్ / ముంబై, నమస్తే ఎల్లంపల్లి: ముంబాయిలో జరిగిన జాతీయస్థాయి బృంద సంగీత పోటీలలో హైదరాబాద్ ఉప్పల్ కు చెందిన విద్యార్థి తంగిరాల జేమ్స్ నోబుల్,వారి బృందం రెండవ రన్నరప్ గా నిలిచి కాంస్య పథకం సాధించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం లోని వెస్ట్ మారేడు పల్లి సెయింట్ ఆండ్రూస్ స్కూల్ లో ఆరవ తరగతి చదువుతున్న తంగిరాల జేమ్స్ నోబుల్, వారి బృందం ఇటీవల జరిగిన హైదరాబాద్ రీజనల్ స్ధాయిలో జరిగిన అంతర్ పాఠశాలల మ్యూజిక్ పోటీలలో ఫైనల్ స్ధానం సాధించి, తమ ప్రతిభను చాటి, ముంబయిలో రెండు రోజుల క్రితం జరిగిన జాతీయ అతిపెద్ద అంతర్ పాఠశాలల సంగీత పోటీలు ఫరటడోస్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ వారు నిర్వహించగా, సంగీతం మాస్టారు మార్షల్ నేతృత్వంలో జాతీయ స్థాయిలో రెండవ రన్నరప్ గా నిలిచి, కాంస్య పథకాన్ని గెలుపొందారు. పాఠశాల యాజమాన్యం విద్యర్ధికి, వారి బృందానికి అభినందనలు తెలిపారు. అదే విధంగా తంగిరాల జేమ్స్ నోబుల్, ఉప్పల్ అర్జున్ హైట్స్ అపార్టుమెంటు నివాసి అయిన ఈ విద్యార్థికి అపార్టుమెంటు వాసులంతా అభినందనలు తెలిపారు. తంగిరాల జేమ్స్ నోబుల్, సంగీత మ్యూజిక్ కీబోర్డు విభాగంలో మరిన్ని జాతీయ పోటీలలో పాల్గొని రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశానికి వన్నె తెచ్చే విధంగా అత్యున్నత స్థాయికి ఎదగాలని,పాఠశాల యాజమాన్యం, అపార్టుమెంటు వాసులు కోరారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading