నవతరం

తెలుగు దినపత్రిక

నిరాశ్రయుల ఆకలి తీర్చండి

* నిరాశ్రాయులను ఆదరించి అన్నం పెట్టండి
* సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్

ములుగు, నమస్తే ఎల్లంపల్లి: మతిస్థిమితం కోల్పోయి, నిరాశ్రాయులైన, అనాధ అభాగ్యులను ఆదరించి అన్నం పెట్టండని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు. ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ బుధవారం మతిస్థిమితం కోల్పోయి, దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ అనాధ యువకుడిని చేరదీసి పెరిగిన క్షవరం చేపించి, శుభ్రంగా స్నానం చేపించి, కొత్త బట్టులు వేసి, కడుపు నిండా అన్నం పెట్టీ ఆదరించారు. యువకునికి గురించి సర్వర్ పౌండేశన్ సభ్యులు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో అతడిని చేరదీసి అన్నం పెట్టారు. యువకుని జేబులో కొంత డబ్బులు ఉన్నా… అవి ఉన్నాయని తెలియని స్థితిలో ఉన్నాడు. అతని సమాచారం తెలుసుకోవడం కోసం వివరాలు అడుగగా అతని పేరు ఇంతో అని మాత్రం తెలిపాడు. తస్లీమా మాట్లాడుతూ ఆకలితో అలమటిస్తూ ఎవరు కనబడినా, ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా అన్నం పెట్టాలని, యువకుని వద్ద డబ్బులు ఉన్న తినలేని స్థితిలో ఉన్నాడని, ఇతరుల ఆకలిని తీర్చడంలో ఉన్న సంతృప్తి మరెక్కడా దొరకదని అన్నారు. ప్రస్తుత కాలంలో చాలా మంది వివిధ కారణాలతో యువకులు మతిస్థిమితం కోల్పోయి, నిరాశ్రాయులు అవుతున్నారని, అలాంటి వారిని మనసున్న మానవతావాదులుగా ఆదరించి, అక్కున చేర్చుకుని పట్టెడు అన్నం పెట్టాలని తస్లీమా కోరారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading