నవతరం

తెలుగు దినపత్రిక

క్యాన్సర్ నిర్మూలన వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన ఏఎస్పి పరితోష్ పంకజ్

భద్రాచలం, నమస్తే ఎల్లంపల్లి: భద్రాచలంలో ఒక హృదయం సోషల్ వెల్ఫేర్ వారు క్యాన్సర్ వ్యాధి వాల్ పోస్టర్లను భద్రాచలం ఏఎస్పి పరితోష్ పంకజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఒక్కరు కూడా క్యాన్సర్ బారిన పడకూడదని, ముందస్తు టెస్టులు చేయించుకోవాలని, యువత వ్యసనాలకు బానిస అవ్వకూడదని వారు సూచించారు. ముఖ్యంగా స్త్రీలు ముందస్తు టెస్ట్ లు చేయించుకునే అవకాశం వచ్చిందని వారు తెలియపరిచారు. ఒక హృదయం సంస్థ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు అభినందించారు. సంస్థ అధ్యక్షులు సంజీవ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదివేల వాల్ పోస్టర్లను అతికించి దీనిపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్నికి అవకాశం కల్పించిన గౌరవ ఏ,ఎస్పి పరితోష్ పంకజ్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశం అని సంస్థ తెలియజేసింది. ప్లాస్టిక్ నిషేధించి, టొబాకో దూరం పెట్టి, క్యాన్సర్ బారిన పడకుండా విముక్తులు అవ్వాలని సంస్థ తెలియజేసింది. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ఎం. సంజీవరెడ్డి, ట్రెజరర్ పొన్నాల కవిత, సంస్థ కార్యవర్గ సభ్యులు కడాలి నాగరాజు, కుమ్మరపల్లి నాగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading