నవతరం

తెలుగు దినపత్రిక

తోటమాలి కార్మికుల వేతనాలు పెంచండి

శ్రీశైలం, నమస్తే ఎల్లంపల్లి: శ్రీశైల దేవస్థానం దేవస్థానం కార్యాలయంలో ఈవో లావణ్య, శాంతి నిలయం, కాటేజీలో టెస్ట్ బోర్డ్ చైర్మన్, రెడ్డి చక్రపాణి రెడ్డి కి ట్రస్ట్ బోర్డు నెంబర్లకి తోటమాలి కాంట్రాక్ట్ లేబర్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వై ఆశీర్వాదం కలిసి వినతిపత్రం అందజేశారు. శ్రీశైలం దేవస్థానంలో పనిచేస్తున్న తోటమాలి కాంట్రాక్ట్ కార్మికులు కార్తికే ఏజెన్సీ నందు దాదాపు 80 మంది కార్మికులు తోటమాలిన గా పని చేస్తున్నారని వారికి కేవలం ఎనిమిది ఎనిమిది ఇస్తున్నారని, ఒకే టెండర్ పాడిన వీరు రెండు రకాల జీతాలు ఇవ్వడం బాధాకరమని, భద్రత లేదని, కనీస వేతన చట్టం ఇక్కడ అమలు కావట్లేదని, కొంతమంది కార్మికులు 10 నుండి 15 సంవత్సరాల పనిచేస్తున్నారని, వారికి వివరించడం జరిగింది.

అనంతరం స్పందించిన వారు… మీరు చెప్పిన విషయాల మీద మీటింగ్ లో మాట్లాడి జీతాలు పెంచలా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో భారీగా నిత్యావసర ధరలు పెరిగాయని, ధరలకు అనుకూలంగా జీతాలు పెంచాలని, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని కార్మికులందరికీ పని భద్రత కల్పించాలని వారిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి తోటమాలి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు గోపాల్, శీను, మల్లేష్, రాజు నాయక్, లింగం కాసులమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading